తెలంగాణ:నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.వడ్డీ వ్యాపారులు,చిట్ఫండ్ ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు ( గుంటోజు బాలరాజు )(38) ప్రస్తుతం కేతపల్లి మండలంలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (ఏఈఓ)గా విధులు నిర్వహిస్తున్నారు.
వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇటీవల కొంత మంది ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నట్లు సమాచారం.అయితే అప్పులపై అధిక వడ్డీలు వేస్తూ,డబ్బుల కోసం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ముందస్తుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుని మానసికంగా వేధింపులకు గురిచేశారని తెలిపారు.గత క్రమంగా చిట్ఫండ్ ఏజెంట్లు, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి పెరగడంతో బాలరాజు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు గుర్తించారు.
ఈ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలరాజు తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.మృతుడికి భార్య పద్మ,కుమారుడు,కుమార్తె ఉన్నారు.
మృతుడి భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


