- మారుతి సుజుకి 100% ఇథనాల్‌తో నడిచే కారును జూన్ 5న విడుదల చేస్తోంది.
- ఈ కారు పెట్రోల్, ఇథనాల్ దానితోనూ నడుస్తుంది, కిలోమీటరుకు తక్కువ ఖర్చు.
- ఇథనాల్ వాడకం రైతులకు, పర్యావరణానికి లాభదాయకం, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
- వ్యాగన్ ఆర్ లేదా ఫ్రాంక్స్ మోడళ్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది.
Maruti Ethanol Car: ఇన్నాళ్లూ పెట్రోల్ ధరలు పెరుగుతుంటే సామాన్యుడు పడిన ఆవేదనకు, డిజిల్ కాలుష్యానికి చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది. దేశంలోనే అతి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, భారత్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా వంద శాతం ఇథనాల్‌తో నడిచే కారును జూన్ 5న లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, దిగుమతి ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా మారుతి ఈ అడుగు వేస్తోంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఈ టెక్నాలజీపై పదే పదే చెబుతున్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో విజయవంతమైన ఈ మోడల్‌ను ఇప్పుడు భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతి సుజుకి తీర్చిదిద్దింది.
పెట్రోల్, ఇథనాల్ ఉత్పత్తులనీ వాడుకోవచ్చు
సాధారణంగా మనం వాడే పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్ కలుపుతారు. కానీ మారుతి తీసుకురాబోయే ఈ కొత్త కారు E100 ఇథనాల్‌తో నడుస్తుంది. అంటే దీనికి పెట్రోల్, డీజిల్ సీఎన్జీ లేదా విద్యుత్ ఏదీ అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్. ఈ కారులోని 1.2 లీటర్ ఇథనాల్, పెట్రోల్ పాత్రనీ స్వీకరించగలదు. మీరు ఇథనాల్ దొరకని చోట పెట్రోల్‌తో కూడా నడుపుకోవచ్చు. కానీ వందశాతం ఇథనాల్ వాడినప్పుడు దీని సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది.
Also Read: నాన్న పండులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!
లీటర్‌కు 3.5 రూపాయలే…మైలేజీ ఎంతంటే?
ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి, ఈ పరిస్థితుల్లో ఇథనాల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారు ద్వారా కిలోమీటర్ ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం 3.5 నుంచి నాలుగు రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా. వంద శాతం ఇథనాల్ పై నడిచినప్పుడు ఈ కారు లీటర్ 15 నుంచి 18 వరకు మైలేజీ వస్తుంది. పెట్రోల్ ఖర్చుతో సగానికిపైగా ఆదా అవుతుంది.
Also Read: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?
వ్యాగన్ఆర్ లేదా ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఏ మోడల్‌ను ముందుగా లాంచ్ చేస్తుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మారుతి వ్యాగన్ ఆర్ లేదా ఫ్రాంక్స్‌లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో మారుతి సంస్థ ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది.
మారుతి ఇథనాల్ కారు ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం
చూడటానికి ఈ కారు ప్రస్తుత మోడల్లాగానే ఉంటుంది. కానీ లోపల ఇంజిన్ వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. కారులో ఎంత ఇథనాల్ ఉంది. అది ఎంత సమర్థంగా పని చేస్తోంది. అని ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. ఇథనాల్్ వల్ల తుప్పు పట్టుండ ఉండేలా ప్రత్యేక పైపులు, ట్యాంక్ డిజైన్ చేశారు. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రైతులకు, పర్యావరణానికి ఎలా లాభం?
ఈ ఇథనాల్ కారు కేవలం వాహనదారులకే కాదు, దేశ రైతాంగానికి కూడా గొప్ప వరం. ఇథనాల్ ప్రధానంగా చెరకు , మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇథనాల్ వాడకం పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర దక్కడమే కాకుండా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పుంజుకుంటాయి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.
ఇది కూడా చదవండి: వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటి?
శిలాజ ఇంధన వినియోగం తగ్గడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఇది గాలిలో నాణ్యతను తగ్గించడమే కాకుండా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో ఉత్పత్తి చేస్తుంది. క్లీనర్ ఎనర్జీ దిశగా భారత్ వేస్తున్న అతి పెద్ద అడుగ్గా దీనిని చెప్పవచ్చు.
ఇంకా చదవండి

