సైబరాబాద్‌లో భారీ భూ కుంభకోణం బయటపడింది. గండిపేట ప్రభుత్వ భూమి వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు 1500 కోట్ల విలువైన భూమిని ఫేక్ జీఓలతో కొట్టేసేందుకు యత్నం చసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నకిలీ జీవోలతో గండిపేటలోని సర్వే నెంబరు 18లో భూమి కబ్జాకు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు.
ఫేక్ రికార్డులను సృష్టించి భూమిని కాజేసే ప్రయత్నం చేశారు పోలీసు అధికారులు. భూ దందా కేసులో నిమ్మల రాజేష్‌గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

