ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు
: ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల పేరుతో వేల రూపాయలు వ్యాపారం చేస్తున్న ఆ ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యాశాఖ అధికారి వినతి పత్రాన్ని అనుమతించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు పుస్తకాల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యాసంస్థల పేరుతో పుస్తకాలు అమ్మకూడదని ముద్రణ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక రూములో డంపుని వేల రూపాయలకు పుస్తకాలు అమ్ముతున్నారా అని అయ్యాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలు, యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బయట మార్కెట్ ధరల కంటే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు పుస్తకాలు, దుస్తులు, షూస్ పాఠశాలల్లోనే విక్రయిస్తూ సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి కానీ, ఈ దోపిడీ కేంద్రాలుగా మారడం సిగ్గుచేటన్నారు.మండల విద్యాశాఖాధికారి తక్షణమే స్పందించి ధర్మ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలతో తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రుల చేపలను సమీకరించి విద్యాశాఖ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్యూ నాయకులు,పాల్గొన్నారు.

