ఫీల్డ్ లెవల్లో ప్రతీ మండలానికి టెక్ వాలంటీర్‌ను నియమించి.. గ్రౌండ్ నుంచి కేడర్‌కు డిజిటల్ సపోర్ట్ అందించడానికి ప్లాన్ సిద్ధం చేసిన టాక్.
- సోషల్ మీడియాపై వైసీపీ స్పెషల్ ఫోకస్..
- రూట్ లెవెల్లో పవర్ చూపించేందుకు రెడీ..
- సోషల్ మీడియా కోసం జెన్‌జీ టీమ్ రెడీ !
- వైసీపీ టెక్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగం..
- టెక్ ఫోర్స్ స్పెషాలిటీ ఏంటి.. టార్గెట్స్ ఏంటి?
Ysrcp Tech Force: వైసీపీ సోషల్ మీడియా పవర్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సోషల్ మీడియాని మరింత విస్తృతంగా యూజ్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది. గ్రాస్ రూట్ లెవల్లో సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతోంది. దీని కోసం సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. పార్టీని స్ట్రాంగ్ చేయడంతో పాటు వైఫల్యం.. కూటమి సర్కార్లను ఎండగట్టడమే లక్ష్యంగా.. జెన్‌జీ టీమ్‌ను రెడీ చేస్తోంది వైసీపీ. వైసీపీ టెక్ ఫోర్స్ అంటూ ఓ విభాగం ఏర్పాటు చేసింది. మరి దీని స్పెషాలిటీ ఏంటి..
టెక్నాలజీ ఇప్పుడు ప్రతీ దాంట్లో భాగమైంది. చివరికి రాజకీయాల్లో కూడా ! అదే టెక్నాలజీని ఉపయోగించుకొని పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ. పార్టీకి టెక్నాలజీ జోడించి.. కేడర్‌లో కొత్త ఉత్సాహం తీసుకురావాలని పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న జగన్.. కేడర్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దీనితోపాటు పార్టీ సోషల్ మీడియాను స్ట్రాంగ్ చేయాలని. దీనికోసం జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో సరికొత్త రూకల్పన చూపబడింది.
ఒక తాటిపైకి ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు..
జగనన్న టెక్ ఫోర్స్‌తో.. ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టెక్నాలజీ వినియోగంపై అవగాహన ఉన్న వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేశారట. పార్టీని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు.. అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం.. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలను.. జగనన్న టెక్ ఫోర్స్ ద్వారా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019లో అధికారంలోకి రావడం.. వైసీపీ సోషల్ మీడియా సైన్యం పాత్ర చాలా కీలకం. దేశంలోనే బలమైన శక్తిగా వైసీపీ సోషల్‌మీడియా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియా వారియర్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. వాటన్నిటినీ సెట్ రైట్ చేస్తూ.. టెక్ ఫోర్స్‌ను తీసుకొచ్చేందుకు వైసీపీ రెడీ అయిందని.
ఫీల్డ్ లెవెల్లో ప్రతీ మండలానికి టెక్ వాలంటీర్..
ఫీల్డ్ లెవల్లో ప్రతీ మండలానికి టెక్ వాలంటీర్‌ను నియమించి.. గ్రౌండ్ నుంచి కేడర్‌కు డిజిటల్ సపోర్ట్ అందించడానికి ప్లాన్ సిద్ధం చేసిన టాక్. ORM.. అంటే ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ ద్వారా సోషల్‌మీడియాలో పార్టీ ఇమేజ్‌ని ప్రామాణిక మానిటర్ చేయడం ప్రతి మండలం నుంచి ఇక ఈ ప్రోగ్రాంకు సంబంధించి క్యూఆర్ కోడ్లు కూడా మొదలయ్యాయట. క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే టెక్ ఫోర్స్ రియాక్ట్ అయి.. వారికి డిజిటల్ సపోర్ట్ అందిస్తోంది. ఒకవైపు గ్రౌండ్ ఫోర్స్ పనిచేస్తుంటే.. మరోవైపు ఈ టెక్నో వారియర్స్ ఆన్లైన్లో పార్టీకి మద్దతుగా పోరాడతారన్న మాట.
కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్..
కార్యకర్తల కోసం యాప్ తీసుకొస్తామని గతంలో జగన్ ప్రకటించారు. అక్రమ కేసులు, వాటికి సంబంధించిన ఆధారాలు యాప్‌లో పొందుపర్చాలని జగన్ సూచించారు. ఈ వస్తువుల అధినేత దృష్టికి తీసుకెళ్లడంలో టెక్ ఫోర్స్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఇక టెక్నాలజీని ఎలా వినియోగించాలో కూడా కేడర్‌కు వివరిస్తోంది వైసీపీ. ఓవరాల్‌గా డిజిటల్ యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా.. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో గేమ్‌చేంజర్ అవుతుందా.. సోషల్ మీడియాలో పట్టు పెరుగుతుందా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: లింగమనేనా? నాగబాబా? పెద్దల సభకు పవన్ పంపేది ఎవరిని..

