- జూన్ 1 నుంచి షురూ
- పూర్తి సామర్థ్యం 29.917 టీకాలు
- ఉన్నవి 5.477 టీఐటీలే
- 70 ఎంజీడీల చొప్పున నీటి సరఫరా
- డెడ్ స్టోరేజీకి చేరువలో నీళ్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట నగరాలకు సరఫరా చేస్తున్న ప్రధాన జలాల సింగూరు రిజర్వాయర్ నీటి మట్టాలు పడిపోయాయి. దీంతో అధికారులు ఎమర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పంపింగ్ ప్రారంభమవుతుందని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించగా, శుక్రవారం బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆరా తీశారు. పటాన్చెరు ట్రాన్స్మిషన్ డివిజన్–-2లో జరుగుతున్న ఎమర్జెన్సీ పంప్‌సెట్ పనుల సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్పూర్తి సామర్థ్యం 29.917 టీకాలు కాగా, ప్రస్తుతం 5.477 టీకాలు మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ అవసరాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి రోజూ 560 ఎంజీడీలు తీసుకువెళుతున్నాయి, సింగూరు నుంచే 70 ఎంజీడీలు సరఫరా అవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్నయ్ 5 టీఎంసీలే..
రిజర్వాయర్‌ను రిపేర్చేయాల్సి ఉందన్న కారణంతో ఇరిగేషన్ అధికారులు ఆరు నెలల కిందటే నీటిని ఖాళీ చేశారు. అప్పుడు 20 టీఎంసీలు ఉండగా 15 టీఎంసీలు బయటకు వదిలిపెట్టారు. కానీ, ఇప్పటివరకు రిపేర్లే మొదలుపెట్టలేదు. ప్రస్తుతం సింగూరులో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఇవి డెడ్‌స్టోరేజీకి (3 టీకాలు) చేరుకోబోతున్నాయి. ఉన్న నీళ్లు కూడా 60 రోజులకు సరిపోతాయని, జూన్‌లో వర్షాలు పడకపోతే నగరానికి మళ్లీ కటకట తప్పదని అధికారులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తున్నయ్
నగరానికి ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి 23 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 11 , మంజీరా నుంచి 40, నాగార్జునసాగర్ నుంచి 275 , ఎల్లంపల్లి నుంచి 163 ఎంజీడీల నీటిని తీసుకువస్తున్నారు. మొత్తంగా కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)పరిధిలో నీటి అవసరాలకు 800 ఎంజీడీల డిమాండ్ఉండగా 560 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మరో 240 ఎంజీడీల కొరత ఉంది. జూన్‌లో భారీ వర్షాలు పడకపోతే సింగూరు నుంచి వచ్చే 70 ఎంజీడీలు ఆగిపోతాయి. దీనివల్ల నీటి కొరత 310 ఎంజీడీలకు చేరుతుంది. దీంతో నగరానికి నీటి కష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది.
అసలేంటీ ఎమర్జెన్సీ పంపింగ్..?
సాధారణంగా జలశయాల్లోని రా వాటర్‌ను పక్కనే నిర్మించిన ఇంటెక్లోకి నేరుగా గ్రావిటీ ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్‌కు నీరు వెళ్తుంది. అక్కడ ట్రీట్ చేసిన నీటిని పైప్లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. అయితే జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న సమయంలో నిర్ణీత స్థాయి వరకు నీరు నేరుగా ఇంటెక్లోకి వెళ్తుంది. ఇలాంటి సమయంలో అత్యవసర (ఎమెర్జెన్సీ) పంపింగ్ అవసరం అవుతుంది. ఇంటిక్ వెల్‌కు సమీపంలోనే భారీ పైపులు, మోటార్లను బిగించి ఇంటెక్వెల్లోకి పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం సింగూరులో నీటి నిల్వలు తగ్గుతూ డెడ్ స్టోరేజీకి దగ్గరవుతున్న కారణంగా మెట్రోవాటర్ బోర్డు అధికారులు అత్యవసరంగా పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రధాన జలశయాల్లో మే 29న నీటి నిల్వలు(టీడీల్లో)
రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీయర్ ప్రస్తుతం
ఉస్మాన్ సాగర్ 3.900 2.673 2.825
హిమాయత్ సాగర్ 2.967 2.058 2.331
సింగూరు 29.917 16.982 5.470
మంజీరా 1.500 0.758 0.370
నాగార్జున సాగర్ 312.045 135.950 152.760
ఎల్లంపల్లి 20.175 8.412 8.548

