– ప్రకటన –
నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలోని పలు ఎరువు ఉత్పత్తులలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి ఆధ్వర్యంలో శనివారం నాడు పలు ఉత్పత్తులను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా ఏవో విలేకరితో ఒక ప్రకటనలు మండల కేంద్రాన్ని సంఘమేశ్వర ఆగ్రో ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా మొత్తం 25 లక్షల విలువైన మందుల దుకాణంలో ఉన్నాయి. వాటిని పరిశీలించగా అందులో గడువు ముగిసిన సుమారుగా రెండు లక్షల రూపాయల విలువైన మందులు పట్టుకోవడం జరిగింది. వాటిని సీజ్ చేసి ల్యాబ్ కు పంపడం జరిగింది. వారి ఫర్టిలైజర్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని , ఎవరైనా చెల్లింపు మందులు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినవాటిని రసాయన మందులు, ముగిసిన విత్తనాలు, అమ్మకాలు చేపట్టి రైతులను అంటగట్టడం చేస్తే రైతులకు నట్టేట ముంచిన ఫర్టిలైజర్ యజమానుల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. రైతులు అడిగినప్పుడు బిల్లులు ఇవ్వకపోవడం, ఎవరైనా రైతులు వచ్చి టిలైజర్ యజమానులపై ఫిర్యాదు చేస్తే వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం యజమానులపై కఠినమైన చర్యలు మరియు కేసులు నమోదు చేసినట్లు హెచ్చరిక.
– ప్రకటన –

