దాసరి నారాయణరావు స్మారక స్థితి: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్ళలో దాసరి నారాయణరావు ఒకరు… వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలకు తన సినిమాల్లో ఇండస్ట్రీ అవకాశాలు ఇచ్చి వాళ్ళని స్టార్లుగా తీర్చిదిద్దిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… అలాంటి దిగ్గజ దర్శకుడు 2017 మే 30వ తేదీన మరణించారు. ఇక ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించాలి అనుకున్న వారికి ఒక చేదు అనుభవమైతే ఎదురైంది. దాసరి నారాయణ రావు ఆయన భార్య పద్మ సమాధులను ఒకే చోట పెట్టారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు పట్టించుకునే నాధుడు కూడా లేకపోయాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ సమాధులను పట్టించుకోవడం లేదంటూ చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అవసరాలే ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించి ఎంతో మంది నటులను, దర్శకులను వెలుగులోకి తీసుకొచ్చిన దాసరి నారాయణరావు సమాధిని ఎవ్వరూ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పాలి. ఆయన సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తచెదారం పేరుకుపోయిన కనీసం వాటిని క్లీన్ చేసే నాధుడు కూడా లేకపోయాడు.
ఇక ఈ పరిశీలన తెలుసుకున్న మంచి మనోజ్ వెంటనే తనతో పాటు తన మనుషులను తీసుకొచ్చి దాని చుట్టూ క్లీన్ చేయించాడు. కొంతమంది మనుషులను పంపించి వాటిని క్లీన్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా కూడా కొన్ని సంవత్సరాల పాటు నటించారు. ఎన్నో సినిమాలకు ఆయన మార్గదర్శి గా మారాడు.
అలాగే కొంతమంది ని ఆదుకోవడంలో కూడా ఆయన చాలావరకు హెల్ప్ చేశాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య ఎవరికి ఎదురైనా దాన్ని పరిష్కరించడంలో ఆయన ముందు వరుసలో ఉండేవారు… అలాంటి దాసరి నారాయణరావు గారిని చనిపోయిన తర్వాత కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. చాలా మంది స్టేజ్ ఎక్కి నాకు దాసరి గారు లైఫ్ ఇచ్చారు అని చెబుతారు. కానీ ఆయనసమధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించే వారు మాత్రం కరువయ్యారు…
ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తుంది…మన ముందు తరం వాళ్ళను గౌరవించడం మన బాధ్యత…ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు దర్శకులు ఒకప్పుడు దాసరి లాంటి దిగ్గజ దర్శకులు చేసిన సినిమాలను చూసి ఇండస్ట్రీలోకి వచ్చారని గుర్తుంచుకుంటే మంచింది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంది…

