తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప నితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ ల న వ్యాఖ్య లు చేశారు.. పార్టీలో అంత ర్గ త ప రిస్థితిని స్ప ష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో జమీందార్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ప్రజలను కలుసడం లేదని.. ప్రత్యేక సామ్రాజ్యాలను నిర్మించుకున్నట్టుగా ఫీలవుతున్నా.. గతంలోనూ సీఎం కావడం.
ఎప్పటికప్పుడు..
వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు.. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కూడా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఆ రెండు సందర్భాల్లోనూ ఆయన కలివిడితనంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని.. ప్రజలను కలుసుకోవడం లేదని.. బీఆర్ ఎస్ సహా.. ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టలేక పోతున్నారని కూడా సూచిస్తుంది.
ఈ క్రమంలోనే అప్పట్లో ఆయన కొన్ని సూచనలు చేశారు. అయితే.. వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలే దు. నిజానికి వారంలో ఒక రోజు పల్లె నిద్ర చేయాలని గతంలోనే చెప్పా.. ఒక్క’రంటే ఒక్కరు కూడా చెవిని ఎక్కించుకోలేదు. ఇక, ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలపై మరోసారి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పైకి చెబుతున్నావి కొన్నే అయినా.. తెర వెనుక ఉన్న కార ణాలు మ రిన్ని ఉన్నాయ ని అంటున్నారు.
1) నియోజకవర్గాల్లో భూకబ్జాల ఆరోపణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఈ వాదన ఎక్కువగా ఉంది.
2) అవినీతి ప్రబలిందన్నది వాస్తవం. ఏసీబీకి వస్తున్న ఫిర్యాదుల్లో సింహభాగం ప్రజాప్రతినిధులపైనే ఉన్నాయన్నది ఇటీవల అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చింది.
3) కొన్ని చోట్ల బీఆర్ ఎస్ నాయకులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతులు కలిపి పనులు చేస్తున్నారు. ఇది మరింత ప్రమాదంగా మారిపోయింది.
4) ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యాంరెటీలపై ఎవరూ పెదవి విప్పడం లేదు. ప్రచారం కూడా చేయటం లేదు.
5)ప్రభుత్వానికి స’మాంతరంగా నియోజక’వర్గాల స్థాయిలో కూడా.. ప్రభుత్వం నడపుతున్న ఎమ్మెల్యేల సంఖ్య నానాపెరుగుతోంది. ఒప్పందం కూడా సీఎం ఆవేదనతోనే ఉన్నారు.
6) పోలీసు-రెవెన్యూ వ్యవస్థలను కొందరు ఎమ్మెల్యేలు తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారా ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్.. తన పార్టీఎమ్మెల్యేలను ఉద్దేశించి జమీందార్లు అనే మాట వినియోగించారు. మరి ఇప్పటికైనా మారుతారా? అనేది చూడాలి.

