మన తెలంగాణ /చారకొండ: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శనివారం ప్రమాదవశత్తు తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన జరిగింది. స్థానికులు ,కుటుంభ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన జెల్ల రామస్వామి(49) శనివారం రాత్రి 9 గంటల సమయంలో తాడి చెట్టు ఎక్కి కల్లు సేకరించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు మోకు తెగి చెట్టు పై నుండి పడి మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థానిక ఎస్సై పి వీరబాబు సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య శ్యామల తో పాటు కుమారుడు ఉన్నారు. దీంతో చారుకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

