Viral News : పది మంది అక్కాచెల్లెళ్లకు ఒక్క తమ్ముడిగా పుట్టిన ఓ యువకుడి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షల మందిని కదిలిస్తోంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక భద్రత, భవిష్యత్తు గురించి చర్చ పెట్టిన అతని ఇప్పుడు నీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆ యువకుడు తన కుటుంబ కథను వివరించాడు. తన తండ్రికి వరుసగా పది మంది కుమార్తెలు పుట్టారని, చివరకు ఒక మగ సంతానం కోసం ఆశగా ఎదురుచూసిన తర్వాత తాను జన్మించానని చెప్పాడు. అయితే కుటుంబ పరిస్థితులను మార్చిన సంఘటన తన తండ్రి క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో వివరించాడు.
తన తండ్రి రోజుల్లో తనను పిలిచి ఒక మాట చెప్పినట్లు ఆ యువకుడు తెలిపాడు. తన పది మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల బాధ్యత మొత్తం తానే, బంధువుల సహాయం అడగకుండా, బాధ్యతను ఎవరితోనూ పంచుకోకుండా వారి వివాహాలను స్వయంగా నిర్వహించాలని తండ్రి కోరాడని చెప్పాడు. ఆ సమయంలో పరిస్థితుల తీవ్రత కాకుండా తండ్రికి మాట ఇచ్చానని, అయితే ఆ మాట భవిష్యత్తులో ఎంతటి ఆర్థిక భారంగా మారుతుందో ఊహించలేదని వివరించాడు.
ఇప్పటివరకు తన అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు ముగ్గురు పూర్తి చేశానని, అయితే ఆ ప్రక్రియలో ఇప్పటికే రూ.35 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయానని అతడు వెల్లడించాడు. వివాహ వేడుకలు, బహుమతులు, కుటుంబ సంప్రదాయాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి భారీ ఆర్థిక భారం పడిందని చెప్పాడు. ఇంకా ఏడుగురు అక్కాచెల్లెళ్ల పెళ్లి మిగిలి ఉన్నాయి, వాటిని కూడా నిర్వహించాలంటే రాబోయే సంవత్సరాల్లో మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు అవసరం కావచ్చని అంచనా వేశాడు.
అయితే తన పరిస్థితిని వివరిస్తూనే అతడు చిరునవ్వుతో చెప్పిన ఆ మాటలు నెటిజన్స్ ని మరింత భావోద్వేగానికి గురిచేసింది. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు పూర్తయి అప్పులు మిగిలి ఉంటే ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని సరదాగా చెప్పాడు. తనకు పిల్లలు పుట్టే సమయానికి తాను అరవై లేదా డెబ్బై ఏళ్ల వయసులో ఉండొచ్చని, అప్పటికి తన పిల్లలు చిన్నారులుగానే ఉంటారని వ్యాఖ్యానించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఎంతోమంది అతని త్యాగాన్ని, కుటుంబం పట్ల చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు. కుటుంబ బాధ్యత అంటే ఇదే, తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు ఇంతటి భారాన్ని భుజాన వేసుకోవడం చాలా అరుదైన విషయం. మరి కొందరు మాత్రం ఈ స్థాయిలో ఆర్థిక భారం మోసుకోవడం సరైన నిర్ణయమా అనే ప్రశ్నను లేవనెత్తారు. కుటుంబం కోసం జీవించడం గొప్ప విషయమే అయినా, వ్యక్తిగత భవిష్యత్తు, ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఈ కథ కేవలం ఒక యువకుడి అప్పుల కథ కాదు. కుటుంబ బంధాలు, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట, బాధ్యత అనే భావన ఎంత బలమైన జీవితాలను ప్రభావితం చేస్తుందో చూపించే మనుషులు ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు తండ్రి చివరి కోరికను నెరవేర్చాలనే ఎన్నో సంకల్పం కనిపిస్తుంటే, మరలా ఒక వ్యక్తి తన జీవితంలో కలలను వాయిదా వేసుకోవాల్సిన వాస్తవం కూడా ఇందులో ఉంది. అందుకే ఈ వీడియో చూసిన వారిలో కొందరికి ఇది స్ఫూర్తిదాయక కథగా అనిపిస్తే, మరికొందరికి ఇది బాధ్యతల భారంతో నిండిన విషాద గాథగా మారింది.

