తెలంగాణ:హైదరాబాద్:లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ( AICC అధ్యక్షుడు Mallikarjun Kharge )ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( రేవంత్ రెడ్డి )మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు.
నేతల మధ్య రాష్ట్ర రాజకీయ పరిస్థితులు,పార్టీ వ్యవహారాలు,ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం.అనంతరం మల్లికార్జున ఖర్గే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కలబురాగి (గుల్బర్గా)కు బయలుదేరి వెళ్లారు.
ఖర్గే పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.

