- బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, ఎన్నికల హామీలు అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
- రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ను కాంగ్రెస్ రద్దు చేస్తోంది కేటీఆర్.
- హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని, ఇళ్లు కూల్చివేస్తోందని.
- బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసి, కాంగ్రెస్ పై పోరాడాలని సూచించారు.
రైతులకు ఉచిత విద్యుత్ | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కేటీఆర్) ఛాలెంజ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఆదివారం జరిగిన సమావేశంలో కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
3 గంటల కరెంట్ చాలన్న వ్యక్తి రేవంత్ రెడ్డి..
రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు ముమ్మాటికీ అబద్ధం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంట్‌ను పూర్తిగా ఎగగొట్టేందుకే రైతు డిస్కం పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని కేటీఆర్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతులపై అంతే ప్రేమ ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్..
‘రైతు డిస్కం’ అనేది రైతన్నల మెడకు ఉరితాడు లాంటిదని, దీని ద్వారా ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా రద్దు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, పారిశ్రామిక సెలవులతో (ఇండస్ట్రియల్ హాలిడేస్) రాష్ట్రం అతలాకుతలం అయిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఆ దుస్థితిని మార్చి, 79 ఏళ్ల భారత చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఏకైక నేతగా నిలిచారు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానంటున్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నల నోటికాడి కూడు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ రైతు వ్యతిరేక కుట్రలపై ప్రజలు కూడా స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరారు.
ఇది కూడా చదవండి: బాల్క సుమన్ రిమాండ్: బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
హైడ్రా భూతంతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి 6 వేల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు, ఇప్పటివరకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించడంతో పాటు జీవో 58, 59 ద్వారా పేదలకు భూమి హక్కులు కల్పించామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (HYDRAA) అనే భూతాన్ని తెచ్చి పేద ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతోందని, వారికి తీరని అన్యాయాన్ని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
కంటోన్మెంట్లో డిఫెన్స్ భూముల బదలాయింపు కోసం, కరీంనగర్, నిజామాబాద్ వైపు స్కైవేల నిర్మాణం కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి వల్లే నేడు ఆ పనులు సాకారమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఆర్మీ అధికారులు అడ్డగోలుగా రోడ్లు మూసివేస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించారు తామేనన్నారు. దేశమంతా కాంగ్రెస్‌ని తిరస్కరిస్తే, తెలంగాణలో అది మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు జరగలేదు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.
ఇంకా చదవండి

