ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు.. వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు.. సేన గళం పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్-జీ మాట వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ యువతకు ప్రాధాన్యత పెంచనుందని చెప్పారు. ఈ సేనాగళం ద్వారా.. సామాజిక సమరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు పాటు పడే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
సేనాగళం పేరుతో కమిటిని ఏర్పాటు చేస్తున్న పవన్ కల్యాణ్.. యువతకు ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారికి ఈ కమిటీలలో ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ నాయకుల కు సూచించారు నియోజకవర్గాల వారీగా సేనాగళం కమిటీలను ఏర్పాటు చేయాలని. ఈ కమిటీకి.. కులాలు, మతాలతో పని ఉండదని.. ప్రజలకు అవసరమైన.. ప్రభుత్వం చేస్తున్న పనులను వారికి అందేలా చేయడమే.. కులాల కుమ్ములాటలకు సేన గళం కమిటీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండదని తేల్చి చెప్పారు.
బూర్జువా సంస్కృతులకు జనసేన తీవ్ర వ్యతిరేకమని కూడా పవన్ కల్యాణ్.. పాతకాలపు విధానాలను బుట్ట దాఖలు చేస్తామన్నారు. అభ్యుదయ భావాలు.. ప్రజల కోసం ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారికి పార్టీలోను.. ముఖ్యంగా సేన గళం కమిటిలోనూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కొందరు నాయకులు, పార్టీలు కూడా.. తాము చేస్తున్న తప్పులకు కులం కార్డు తొడుగుతున్నారని. వ్యక్తులు చేసే తప్పులకు సమాజం బాధ్యత వహించాలా? అని ప్రశ్నించిన ఆయన.. దీనినే నేటి యువత వ్యతిరేకిస్తోందని.
సేన గళం బాధ్యతలు ఇవీ..
- సేన గళంలో చేరే వారికి.. వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి.
- విద్యావంతులకు పెద్ద పీట… చదువుకున్నా లేకున్నా.. సమాజానికి మేలు చేయాలన్న భావనతో ఉండాలి.
- కులాలకు, మతాలకు అతితంగా కమిటీలను ఏర్పాటు చేయాలి.
- కుల రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలకాలి.
- దేశం భావ న ప్రతిబింబించేలా కమిటీలు ఉండాలి. అలానే ప నిచేయాలి.
- యువతరం ఆశలను ఈ కమిటీలు ప్రతిబింబించాలి.
- ప్రజలతోను.. ముఖ్యంగా యువతతోనూ మమేకం కావాలి.

