పంజాగుట్ట, వెలుగు : హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 53వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఐటీసీ కాకతీయ హోటల్లో ఘనంగా జరిగింది. వేడుకలకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రనారెడ్డి ముఖ్య అతిథిగా, హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నంద విశిష్ట అతిథిగా ఉన్నారు. త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి నల్లు మాట్లాడుతూ మేనేజ్మెంట్ అనేది వ్యాపార సంస్థలకే పరిమితం కాదని, అది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమన్నారు. జస్టిస్ సురేపల్లి నంద మాట్లాడుతూ..డిజిటల్ యుగంలో న్యాయవ్యవస్థ, మేనేజ్మెంట్ విధానాలు, ఏఐల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉంది.
ఎంఏ అధ్యక్షుడు అల్వాలా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను భావి ప్రదర్శన రంగానికి సిద్ధం చేయడానికి ‘సక్షం’ అనే ప్రత్యేక గుర్తింపును అందించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన 13 మందికి అవార్డులు. భారత రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేయడంతో పాటు క్షిణి, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధిలో అత్యుత్తమ సహకారం అందించినందుకు డీఆర్ డీవో డైరెక్టర్ జనరల్ యు. రాజబాబుకు లైఫ్ అచీవ్టైమ్ అవార్డు, జర్నలిజంలో విశిష్ట సేవలు అందిస్తూ, హెచ్ఎంఏ ఆశయాలకు మద్దతుగా నిలుస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్కి హెచ్హెచ్ఎంఏ మెంబర్ ఆఫ్ దియర్ అవార్డు.

