విరాట్ కోహ్లీ వైరల్ డ్యాన్స్ స్టెప్పులు: బెంగళూరు మరోసారి సత్తా చాటింది. గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ఆ జట్టు.. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు క్రీడాకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బెంగళూరు విజయంలో విరాట్ కోహ్లీ (75) కీలకపాత్ర పోషించాడు
. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేసి బెంగళూరు జట్టు ఆశల మీద నీళ్లు చల్లాడు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ చివరి వరకు నిలబడ్డాడు. తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉన్న గుజరాత్ జట్టుకు చుక్కలు చూపించాడు. గత సీజన్లో కూడా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫైనల్ స్ఫూర్తి దాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. తోటి ప్లేయర్లు విఫలమైనప్పటికీ అతడు మాత్రం.. గట్టిగా నిలబడ్డాడు.. దీంతో గిల్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని విధించిన రజత్ పాటిదర్ బృందం సులభంగా చేదించింది. క్వాలిఫైయర్ లో గుజరాత్ జట్టును ఓడించిన బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టును సొంత వేదికపై ఓడించి ట్రోఫీని అందుకుంది.
2008లో ఐపీఎల్ మొదలైతే.. చాలా సందర్భాలలో బెంగళూరు జట్టు ఫైనల్ వరకు వచ్చింది. కానీ ట్రోఫీలను అందుకోలేకపోయింది. గత సీజన్లో మాత్రం పాత పద్ధతికి చరమగీతం పాడుతూ.. ట్రోఫీ అందుకుంది. ఈ సీజన్లో కూడా ప్రారంభం నుంచి స్థిరమైన ఆట తీరుకొనసాగిస్తూ ట్రోఫీ గెలుచుకుంది. అక్కడ ఐపీఎల్లో బెంగళూరు తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకుంది.
బెంగళూరు సాధించిన విజయం తర్వాత విరాట్ కోహ్లీ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. బ్యాండ్ చప్పుడుకు అనుగుణంగా డ్యాన్స్ వేశాడు. ఆ సమయంలో భార్య అనుష్క శర్మ తన వెంట ఉండగా.. ఆమెను కూడా తనతో పాటు డాన్స్ చేయాలని కోరాడు. భర్త జోరు చూసి అనుష్క శర్మ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ అవుతోంది.
‘
స్వచ్ఛమైన వైబ్స్. సంపూర్ణమైనది. మరియు చాలా ఎక్కువ. అనుష్క శర్మ, మా మొదటి రోజు అయినందుకు ధన్యవాదాలు. ❤️ pic.twitter.com/7Qmxxv6QtG
— రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (@RCBTweets) జూన్ 1, 2026

