నాని ది ప్యారడైజ్ మూవీలో చిరంజీవి మే కీ రోల్: నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ద ప్యారడైజ్’. ఫస్ట్ సాంగ్ ఆయా షేర్‌తోనే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.
నాని మూవీలో మెగాస్టార్
నాని ది ప్యారడైజ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు శికంజి మాలిక్‌గా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. క్లైమాక్స్‌లో చిరు ఓ స్పెషల్ రోల్ ఎంట్రీని తెలుస్తుండగా… ఆ తర్వాత మూవీకి లింక్ పెట్టడం ఫిలింనగర్ వర్గాల టాక్.
ప్యారడైజ్ షూటింగ్ జరుగుతున్నప్పుడే చిరు, శ్రీకాంత్ ఓదెల మూవీ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్, బాబీ కొల్లి మూవీ షూటింగ్ సాగుతుండగా… ఆ తర్వాత శ్రీకాంత్‌తో ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కనుంది. అటు, శ్రీకాంత్ ఓదెల కూడా ప్యారడైజ్ త్వరగా పూర్తి చేసి… నెక్స్ట్ చిరు మూవీపై ఫోకస్ చేయనున్నారు. ఈ కోరికనే ప్యారడైజ్ మూవీకి, చిరు మూవీకి ఓ లింక్ పెట్ట ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ‘ది ప్యారడైజ్’కు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
సినిమాటిక్ యూనివర్స్
ఒక మూవీతో మరో మూవీ లింక్ చేయడం అనేది సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్. ఇప్పుడు అదే ట్రెండ్‌లోకి శ్రీకాంత్ ఓదెల కూడా ఎంటర్ అవుతున్నారట. ప్యారడైజ్ క్లైమాక్స్‌లో చిరుతో క్యామియో రోల్ చేసి… దాన్ని నెక్స్ట్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో లింక్ చేయడానికి శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇదే నిజమైతే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రా అండ్ రాక్ లుక్‌లో నాని రోల్ అదిరిపోయింది. ఇప్పుడు చిరు కూడా యాడ్ అవుతున్నారనే రూమర్‌తో హైప్ పదింతలు పెరిగాయి. ఇద్దరు హీరోలకు తగ్గట్లే శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి : ఈ వారం OTT సినిమాలు : థియేటర్లలో పెద్ది…ఓటీటీలో ధురంధర్ 2 – జూన్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీస్ డోంట్ మిస్
జడల్ అనే పవర్ ఫుల్ పాత్రలో నాని కనిపించనుండగా… కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తుండగా… ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. శికంజా మాలిక్‌గా మోహన్ బాబు, బిర్యానీ పాత్రలో సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తోంది… SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆగస్ట్ 21న పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్.
Also Read : Raaka Update : అల్లు అర్జున్ రాకాలో మలయాళ బ్యూటీ – అసలెవరీ ఫెమినా జార్జ్… బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
గమనిక : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్లు, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకా చదవండి

