ఢిల్లీలో బీజేపీ నేతలతో తమిళనాడు నేత అన్నామలై సమావేశం అయ్యారు. ముందుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తో ఆయన సమావేశమయ్యారు. తమిళనాడులో అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నారంటూ ఇటీవల రాష్ట్రంలో ప్రచారం జరిగింది. పెద్దయెత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి.
కొత్త పార్టీ ప్రచారంపై…
దీనికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి అన్నామలై ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త పార్టీలపై రెండు రోజుల్లో వివరణ ఇస్తానని చెప్పి అన్నామలై ఈరోజు బీజేపీ అధ్యక్షుడిని కలిసి ఆ ప్రచారం రావడానికి గల కారణాలను వివరించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా అన్నామలై కలవనున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని అభిమానుల పోస్టర్లు వేశారని అన్నామలై వివరించినట్లు తెలిసింది.

