నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కలిశారు. తాజాగా టీవీకే అధినేత ఢిల్లీ పర్యటనలపై డీఎంకే డీప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ. రాజా సెటైర్లు వేశారు. వాట్ బ్రో, ఏం జరగుతుందా ని మీడియా సమావేశంలో ప్రశ్నలు గుప్పించారు. ఢిల్లీకి వెళ్లి కేవలం వాళ్లలనే కలువడంలే అంతర్యమేంటని, ఇతర కేంద్రమంత్రలను ఎందుకు కలువలేదని ప్రశ్నించారు. ఆరు నెలల వరకు విజయ్ ప్రభుత్వంపై తాము విమర్శలు చేయబోమని తమ అధినేత ఎంకే స్టాలిన్ చెప్పారని గుర్తు తెలియజేశారు. కానీ విజయ్ చార్యలు తమిళనాడు ప్రజాలకు విరుద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ముగియగానే మీడియా సమావేశం ఎందుకు నిర్వహించలేదని మండిపడ్డారు.
“అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ లేవనెత్తిన ప్రశ్నలకు విజయ్ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు?” అని ఆయన ప్రశ్నించారు. “మీరు మాకు గౌరవం ఇస్తే, మాకు తిరిగి గౌరవం లభిస్తుంది. మేము అగౌరవకరమైన భాషను ఉపయోగించము,” అని ఆయన చెప్పారు.
పోస్ట్ ఏంటి బ్రో? ఏమవుతోంది బ్రో?.. సీఎం విజయ్‌పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు మొదట కనిపించింది నవతెలంగాణ.

