విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన మాదిగ విద్యార్థి మందల ప్రభంజన్, బాయ్స్ టౌన్ స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో 563 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన సందర్భంగా అనంతపురంలో మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఘనంగా సన్మానించి ప్రతిభ పురస్కారాలు అందజేసారు. కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభంజన్కు అభినందనలు, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

