వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కానున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో తాము వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. 2023లో ఒంటరిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని చెప్పారు. జరుగుతున్న ఏ ప్రచారాన్ని నమ్మవద్దని కేటీఆర్ హితవు పలికారు.
తెలంగాణ అన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమాగం అయిందని కేటీఆర్ అన్నారు. దానిని తిరిగి పునర్నించుకోవాల్సిన అవసరం ఉందని, అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది కేసీఆర్ మాత్రమేనని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహాయం. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ సర్కార్ అన్ని రంగాలను విధ్వంసం చేసిందని కేటీఆర్ అన్నారు.

