సీనియర్ హీరోల అభిమాన దర్శకులు: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళందరు అప్పటి నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు… ఈ నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటిదే వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళు చేసిన సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. ఈ సీనియర్ హీరోలకు ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో ఎవరంటే బాగా ఇష్టం అనే విషయం మీద ఒక్కొక్కరు ఒక్కో టైంలో స్పందించారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి అంటే చాలా ఇష్టమని తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటి ముందుకు తీసుకుపోతున్నాడని ఈ తరం దర్శకుల్లోనే కాదు తర్వాత రాజమౌళిని బీట్ చేసే దర్శకుడు ఎవ్వరూ లేరంటూ ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు… నటసింహం బాలయ్య బాబు కూడా ఈ జనరేషన్లో ఉన్న దర్శకులలో కూడా రాజమౌళి అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. విక్టరీ వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు.
ఎందుకంటే అంతరించిపోతున్న కామెడీని తన సినిమాలతో మరోసారి అందించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని కి రప్పించాడు. అందుకే అనిల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు… నాగార్జున సైతం ఈ జనరేషన్ లో ఉన్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
ఎందుకంటే అతని సినిమాలో పెద్దగా కథ లేకపోయిన తన మేకింగ్ తో డైలాగులతో ప్రేక్షకుడిని స్టడీగా కూర్చోబెడతాడు. అలాగే యూత్ కి కావాల్సిన అంశాలు అతని సినిమాలో ఉంటాయి. కాబట్టి అతనంటే చాలా ఇష్టమని తెలియజేశాడు. అయితే ఈ హీరోలందరు వాళ్లకు ఇష్టమైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

