తెలంగాణ ఈగల్ పోలీసులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. కోట్లాది రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. అందిన సమాచారం మేరకు తెలంగాణ ఈగల్ పోలీసులు ఈ భారీ ఆపరేషన్ చేశారు. ఈగల్ ఫోర్స్ స్మగ్లింగ్ ముఠా నెట్వర్క్ ఛేదించింది.
పన్నెండు కోట్ల విలువైన…
పన్నెండు కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేయగలిగారు. ఈ కేసులో విదేశీ మహిళతో పాటు 10 మంది పెడ్లర్లను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. థాయ్లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయి హైదరాబాద్ కు తరలిస్తుండగా ఈగల్ ఫోర్స్ దాడులు చేసి పట్టుకుంది.

