నవతెలంగాణ-హైదరాబాద్: పూణెకు చెందిన ఐటీ సంస్థ ‘థింక్టెక్ ఇండియా’ తన కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆఫీసులకు తాళాలు వేసి, కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు రావలసిన బకాయి జీతాలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇప్పించాలంటూ ఉద్యోగుల ఆందోళన బాట పట్టారు. ఈ పరిణామంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్థిక అక్రమాలు, మోసాలకు వచ్చిన ఆరోపణలపై కంపెనీ సీఈఓ హర్షల్ ఠాక్రేను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోస్ట్ బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..! మొదట కనిపించింది నవతెలంగాణ.

