కేరళ, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో కేరళ, తమిళనాడులో వానలు పడతాయని తెలిపిం ది. ఈ ఏడాది ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందే అవకాశాలున్నాయి.
వారంలో ఏపీ, తెలంగాణలోకి…
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో కేరళ, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కేరళలోని మూడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులో 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

