- హైదరాబాద్ అమీర్‌పేటలో బొమ్మల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
- మంటలు పక్కనున్న 20 బట్టలకు వ్యాపించి, భవనం దగ్ధమైంది.
- మంటలు, పొగతో ట్రాఫిక్ జామ్, పోలీసులు దారి మళ్ళించారు.
హైదరాబాద్ అగ్ని ప్రమాదం: హైదరాబాద్ సిటీ నడిబొడ్డు అమీర్‌పేటలో మెయిన్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. అవి ఆర్పేలోపు మొత్తం ఆ బిల్డింగ్‌లో ఉన్న అని ఉత్పత్తులకు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు కమ్ముకున్న పొగతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది.
బొమ్మల దుకాణం నుంచి..
బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న KSR ఫ్యాషన్ అనే బట్టల దుకాణానికి అంటుకోవడంతోనే మంటలు ఎగసిపడ్డాయి. మొత్తం బిల్డింగ్ మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోయింది. భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం అగ్నిమాపక సిబ్బంది భయపడిపోయారు.
#HYDTP సమాచారం
🚨 ట్రాఫిక్ అలర్ట్🚨
అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్‌లోని మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలోని KSR ఫ్యాషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆపరేషన్ల కారణంగా, అమీర్‌పేట్ నుండి SR నగర్ వరకు వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి, ఫలితంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది… pic.twitter.com/tGOSm2IQ5R
— హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@HYDTP) జూన్ 4, 2026
20కిపైగా దుకాణాలు దగ్ధం.
బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేశాయి. మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలిబూడిద అయ్యింది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. వీటిలో 20కిపైగా షాపులు కాలిబూడిదైనట్టు కనిపిస్తాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చారు.. అక్కడి నుంచి పరుగులు తీశారు.
వీడియో | హైదరాబాద్: అమీర్‌పేటలోని ఓ వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో పలు అగ్నిమాపక యంత్రాలు. #హైదరాబాద్ ఫైర్ #హైదరాబాద్ వార్తలు
(పూర్తి వీడియో PTI వీడియోలలో అందుబాటులో ఉంది – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Nda3TsULct
— ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (@PTI_News) జూన్ 4, 2026
భారీగా ట్రాఫిక్ జామ్
విషయం తెలిసిన వెంటనే సిబ్బంది, పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. KSR ఫ్యాషన్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పొగ, మంటలు కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
#చూడండి | హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని హెల్మ్టే బజార్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఏడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. https://t.co/cYwikZOAx1 pic.twitter.com/KI5MF5shSE– ANI (@ANI) జూన్ 4, 2026
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

