ఢీ ఫేమ్ పాండు మాస్టర్ సర్జరీకి ఎమ్మెల్యే సహాయం ఢీ షో పండు మాస్టర్‌కు గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అండగా నిలిచారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన పండు ఫ్రెండ్స్‌కు స్వయంగా కాల్ చేసి వివరాలు అడిగారు. ఖర్చు ఎంతైనా సరే ఆలోచించకూడదని… బెస్ట్ ట్రీట్మెంట్ చేయాలని సూచించారు. డాక్టర్లతో తాను కూడా మాట్లాడతానని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండు మాస్టర్‌కు పల్లా సపోర్ట్‌గా నిలవడంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు, పండు మాస్టర్ ప్రమాదానికి గురి కావడంపై బుల్లితెర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇస్తారు.
అతివేగమే కారణమా?
ప్రమాదానికి కోళ్ల వ్యాన్ అతి వేగమే కారణమని సూచిస్తుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడం వల్లే వాహనం అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు. పండు మాస్టర్ గాయపడడంపై ఆవేదన చెందాడు.
ఇలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గానికి చెందిన ఒక డాన్స్ మాస్టర్‌కు ప్రమాదం జరిగిన ఓ స్థానిక నాయకుడు ఫోన్ చేసి చెప్పగా, “ఎంత ఖర్చు పెట్టలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ చేయించండి. డబ్బులు నేను సమకూరుస్తాను” అని చెప్పే నాయకులు చాలా… pic.twitter.com/hCxB8nCXy2
— యష్ (@YashTDP_) జూన్ 3, 2026
ఇది కూడా చదవండి : Maa Behen Telugu OTT : మాధురి దీక్షిత్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ – కీ రోల్లో స్పిరిట్ బ్యూటీ… తెలుగులోనూ స్ట్రీమింగ్
పండు మాస్టర్‌కు సర్జరీ
పండు మాస్టర్ రెండు కాళ్లకు సర్జరీ చేయాల్సి ఉందని విశాఖ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బుధవారం సర్జరీలో భాగంగా నడుము కింద భాగంలో జైంట్ డిస్ లొకెట్ అయితే క్లియర్ చేశామని చెప్పారు. ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదని… సర్జరీ తర్వాత 6 నెలలు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటుందని. ఆ తర్వాత యథావిధిగా డ్యాన్స్ కంటిన్యూ చెయ్యొచ్చని అన్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
పండు మాస్టర్ తన టీంతో మంగళవారం విశాఖ జిల్లా తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా ఆనందపురం సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. వీరి బృందంలో ఓ వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురి కాగా అతని కోసం రోడ్డు పక్కన కారు ఆపారు. ఇదే టైంలో వెనుక నుంచి వస్తోన్న కోళ్ల వ్యాన్ అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది.
కారు మధ్యలో పండు మాస్టర్ చిక్కుకోగా కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది.
Also Read : Ugly Story OTT : అగ్లీ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ – 15 రోజుల్లోపే ఓటీటీలోకి నందు, అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్
గమనిక : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్లు, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

