- హైడ్రోపోనిక్ గంజాయిని దేశమంతా సరఫరా చేస్తున్న ముంబై గ్యాంగ్
- మొత్తం 150 మంది క్యారియర్లు, హైదరాబాద్‌కు చెందిన 15 మంది
- శంషాబాద్ సహా ఐదు ఎయిర్ పోర్టుల మీదుగా ఇండియాలోకి సరఫరా
- సిండికెట్లో గ్యాంగ్ స్టర్స్, షార్ప్ షూటర్స్
- డీఆర్ఐ, కస్టమ్స్‌తో కలిసి ఈగల్ ఫోర్స్ జైంట్ ఆపరేషన్
- కింగ్‌పిన్ హేమాంగ్ ప్రమోద్ సహా 15 మంది అరెస్ట్,
- 13 కోట్ల విలువైన ఓషన్ గాంజా స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: థాయ్‌లాండ్ కేంద్రంగా ముంబై గ్యాంగ్ స్టర్స్ వల్ల హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను రాష్ట్ర ఈగల్ ఫోర్స్ ఛేదించింది. శంషాబాద్ ఎయిర్పోర్డులో పట్టుబడుతున్న క్యారియర్లను విచారించి.. థాయ్‌లాండ్, ముంబై డ్రగ్స్ సిండికెట్ ముఠా గుట్టురట్టు చేసింది. ఏప్రిల్ 19 నుంచి ‘ఆపరేషన్ ఓజీ’ నిర్వహించింది. ముంబైకి చెందిన హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ హైదరాబాద్‌కు చెందిన 13 మందిని కస్టమ్స్, డీఆర్ఐతో కలిసి అరెస్ట్ చేసింది.
రూ.13 కోట్లు విలువ చేసే13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసింది. విస్తరించిన ఈ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ సిండికెట్ వివరాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గురువారం ఏర్పాటు చేసారు. ఈ సిండికేట్ ముంబై గ్యాంగ్ స్టర్స్ హైదరాబాద్ కోకాపేటలో కూడా పబ్బులు, క్లబ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అదే జరిగితే హైదరాబాద్ గ్యాంగ్స్టర్స్ నెట్‌వర్క్‌లోకి వెళ్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 8న బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన సోదా మోహ్సిస్ బహదుర్ భాయ్ అనే ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని బ్యాగేజ్ నుంచి రూ.13 కోట్లు విలువ చేసే 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకుంది. అదే ఫ్లైట్‌లో వచ్చిన అతని సహచరుడు హర్షద్ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి మరో హైడ్రోపోనిక్ గంజాయితో బ్యాగ్‌తో తప్పించుకున్నాడు. కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
కస్టమ్స్ కి చిక్కిన బహదూర్ ను విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఫ్రీ ఆర్సీ పురం బీహెచ్ఎల్ జంక్షన్ వద్ద ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టింది. ఈ తనిఖీల్లో హర్షద్ తో పాటు మరో నిందితుడు సందీప్ వాస్వాని అలియాస్ రాహుల్ జైన్ ఈగల్ కు చిక్కారు. వీరి వద్ద 12.739 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి, మొబైల్ ఫోన్లు, ఐడీ కార్డులు, ట్రావెల్ టికెట్లను ఈగల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
థాయ్‌లాండ్‌లో గంజాయి సాగు..
కస్టమ్స్ కు చిక్కిన సోదా మోహ్సిస్ తో పాటు ఈగల్ కు చిక్కిన హర్షద్ ను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో విచారించారు. ఈ కోరనే ఏప్రిల్ 8న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌కు చిక్కిన గుజరాత్ ముంద్రా పోర్ట్‌కు చెందిన తల్ అబ్దుల్లా భాయ్ సద్రుద్దిన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఈగల్ దర్యాప్తులో వెలుగు చూసింది.
థాయ్‌లాండ్, -హైదరాబాద్, ముంబై మధ్య హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ కోసం సిండికెట్ నడుపుతున్నట్లు తేలింది. కాగా, ఈ నెట్ వర్క్ లో క్యాష్ పేమెంట్స్ మినహా ఎలాంటి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేదని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో వెలుగు చూసింది. గుజరాత్, ముంబైలోని హవాలా వ్యాపారుల ద్వారా థాయ్ బాట్స్ కొనుగోళ్లు, మనీలాండరింగ్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్టు ఈగల్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ ఐ, కస్టమ్స్ కు చిక్కిన క్యారియర్లు వెల్లడించిన వివరాల ఆధారంగా థాయ్ లాండ్, ముంబై సిండికెట్ నెట్ వర్క్ ను ఛేదించింది.
ముంబైలో గ్యాంగ్‌స్టర్ స్మగ్లింగ్ దందా
ముంబైకి చెందిన హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ అతని తండ్రి ప్రమోద్ బాబు కెలుస్కర్, దుబాయ్‌లో నివాసం ఉంటున్న జేతమ్ ఫైసల్ గులామ్ మహమ్మద్ సహకారంతో గతంలో అఫ్జల్ టొబాకో, విమల్ గుట్కా, బంగారం స్మగ్లింగ్ చేసేవారు. అడ్డొచ్చిన వారిని అతి కిరాతకంగా హతమార్చేవారు. షార్ప్‌షూటర్స్‌ను స్మగ్లింగ్‌లో నియమించారు. స్మగ్లింగ్‌లో అదే ప్రదర్శించిన ప్రవీణ్ లాహు రౌత్, సురజ్ పాల్ అలియాస్ కబీర్ కుమార్ ఆర్య హవాలా రూపంలో లావాదేవీలు జరిపేవారు.
వీరితో పాటు ముంబై కుర్ల ఈస్ట్‌కు చెందిన మహమ్మద్ ముస్తఫా ఇస్మాయిల్ హవాలా ఆపరేటర్‌గా పనిచేస్తూ, అరబ్ దేశాలు, థాయ్ లాండ్కు నిధులు సమకూర్చడంలో హేమాంగ్ కెలుస్కర్కు సహకరించాడు. ముంబైలో ఇండియన్ కరెన్సీ సేకరించి, స్థానిక ఖాతాదారుల ద్వారా విదేశీ బ్యాంకుల్లో జమ చేయించేవాడు. ఈ కోరనే 2013లో తండ్రి ప్రమోద్ బాబు కెలుస్కర్తో కలిసి రూ.500 కోట్లు విలువ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ డీఆర్ ఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత కూడా స్మగ్లింగ్ కొనసాగిన హేమాంగ్.. 2023లో అతని తమ్ముడు సుధాాంశతో కలిసి థాయ్‌లాండ్‌లోని పటాయాలో జల్వా క్లబ్ ప్రారంభించాడు.
హైదరాబాద్‌కు చెందిన 15 మంది క్యారియర్లు
హేమాంగ్.. థాయ్‌లాండ్‌లో జల్వా క్లబ్‌ను నిర్వహిస్తున్నాడు.. అక్కడే రెండు భాగాల హైడ్రోపొనిక్ గంజాయి సాగుచేస్తున్నాడు. జల్వా క్లబ్‌కు బాలివుడ్ నటులతో పాటు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తుండేవారు. వీరికి హైడ్రోపోనిక్ గంజాయితో పాటు అవసరమైన సింథటిక్ డ్రగ్స్ సప్లయ్ చేసేవారు. ఈ విధంగానే థాయ్‌లాండ్‌లో సాగు చేసిన ఓషన్ గాంజాను ఇండియాకు సప్లయ్ కోసం హేమాంగ్ ముంబైలోని మరికొంత మంది గ్యాంగ్స్టర్స్, షార్ప్ షూటర్స్‌తో కలిసి సిండికెట్ ఏర్పాటు చేశాడు.
ఇందులో ఒకడైన షార్ప్ షూటర్ సురజ్ పాల్ అలియాస్ కబీర్ కుమార్ ఆర్యకు సిండికెట్ బాధ్యతలు అప్పగించారు. సురజ్ పాల్ మాదక ద్రవ్యాలను ట్రాన్స్ పోర్ట్ కోసం క్యారియర్లను సమకూర్చడంతో పాటు, క్యారియర్లకు ఫ్లైట్ నుంచి స్మగ్లింగ్ టికెట్లు, థాయ్ ల్యాండ్ నుండి స్మగ్లింగ్ అయిన గంజాయి సేకరించడం స్థానిక పెడ్లర్లు విక్రయించడం వంటి కార్యకలాపాలను నిర్వహించేవాడు. సిండికేట్ క్యారియర్లలో ముంబైకి చెందిన 50 మంది యువకులతో పాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రషీద్, అమన్, ఇబ్రహీం అబ్దుల్లా బిన్ ఉస్మాన్ సహా మొత్తం 15 మంది హైడ్రోపోనిక్ గంజాయి నెట్ వర్క్‌లో చిక్కుకున్నారు.
ఇలా మొత్తం 150 మందిని గంజాయి క్యారియర్లుగా ఏర్పాటు చేశారు. థాయ్‌లాండ్‌కు పంపించి.. పటాయాలోని హోటళ్లలో వసతి కల్పించేవారు. ఎయిర్ పోర్టులో పట్టుపడకుండా హైడ్రోపోనిక్ గాంజాను ప్యాకింగ్ చేసేవారు. ఢిల్లీ, ముంబై, శంషాబాద్ ఎయిర్ పోర్టు సహా ఐదు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల మీదుగా ట్రాన్స్ పోర్ట్ చేసేవారు. రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు చేర్చే వారు. ఆ తర్వాత స్థానిక పెడ్లర్లు, కస్టమర్లకు విక్రయించేవారు.
హైదరాబాద్ క్లబ్ ఏర్పాటుకు సన్నాహాలు
థాయ్‌లాండ్‌లో జల్వా క్లబ్‌లోనే హైదరాబాద్‌లో కూడా అలాంటి క్లబ్ లేదా పబ్‌ను ఏర్పాటు చేసేందుకు హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న హైదరాబాద్ కు వచ్చాడు. తాజ్ కృష్ణ హోటల్ బసచేశాడు. క్లబ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ల్యాండ్ ల్యాండ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కాగా, ఇప్పటికే హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ కదలికలపై నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ కు… సమాచారం అందింది. దీంతో ఈగల్ ఫోర్స్ అధికారులు హేమాంగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. హేమాంగ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలు రిమాండ్‌లో ఉన్నాడు. థాయ్‌లాండ్‌లో జల్వా క్లబ్‌ను నిర్వహిస్తున్న గంజాయి ఎక్స్పోర్ట్ చేస్తున్న అతని తమ్ముడు సుధాాంశపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

