మోటరోలా భారతదేశ టెక్ మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ను లాంచ్ చేసింది. అయితే, ఇటీవల ఎడ్జ్ 70 ప్రో విడుదల చేసిన విషయం తెలిసిందే! కాగా, కంపెనీ తాజాగా ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త హ్యాండ్సెట్ ప్రో మోడల్‌తో తాజా వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో సహా అనేక ముఖ్యమైన అప్డేట్లను అందిస్తుంది. ఈ డివైజ్‌లో మునుపటి ఎడ్జ్ 70 ప్రోలో ఉన్నటువంటి అదే మీడియాటెక్ డైమెన్సిటీ 8000 సిరీస్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఫోన్ ధర, లభ్యత, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ ధర, లభ్యత
ధర విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ 47,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్‌పై కంపెనీ ఒక ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా రూ.3,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ పరికరం ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తుంది. మొదటి సెల్ జూన్ 11న ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో ఉంది. కాగా, ఈ పరికరం పాంటోన్ చికోరీ కాఫీ, పాంటోన్ స్టార్మీ సీ, పాంటోన్ జిన్‌ఫాండెల్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ ఫీచర్లు
డిస్ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హాలో UI పై పనిచేస్తుంది. ఇందులో 6.8-ఇంకా 1.5K రిజల్యూషన్ ఎక్స్ట్రీమ్ ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్‌డ్రాప్ టచ్ సపోర్ట్ ఉన్నాయి.
చిప్సెట్: 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి 2,400,000 AnTuTu స్కోర్ ఉందని కంపెనీ. ఫోన్‌ను కూల్‌గా ఉంచడానికి ఇందులో వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.
కెమెరా: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ LYT710 కెమెరా సెన్సార్, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
బ్యాటరీ: ఈ ఫోన్లో 6500 mAh బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్డ్, 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 5W వైర్డ్, వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కనెక్టివిటీ: ఈ ఫోన్ 5G, 4G LTE, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ వెర్షన్ 5.4, GPS, GLONASS కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. సేఫ్టి కోసం, ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

