సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో విలువైన అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ప్రకారం, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి న్యాయమూర్తి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రకృతి పరిస్థితులను కాపాడుకోవడానికి, కాలుష్య రహిత సమాజ స్థాపనకు పర్యావరణ అవశ్యకతను గుర్తించాలన్నారు. పర్యావరణ వేడుకల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. లక్ష్మీనారాయణ. బార్ వైస్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి , సీనియర్ న్యాయవాదులు నాగరాజు, శంకర్ నారాయణ రెడ్డి, దుర్గాప్రసాద్, బాల సుందరి, న్యాయవాదులు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.

