రాజమౌళి, మహేశ్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయనే వార్తలు రాగానే.. ఆ యుద్ధం రాముడికి, రావణుడికి మధ్య ఉంటుందనే అంచనాతోనే ఉన్నారందరూ. కానీ ఎన్నోసార్లు ఇండియన్ సినిమాల్లో, సీరియళ్లలో చూసిన ఎపిసోడ్‌ను రాజమౌళి ఎంతగా చూపిస్తాడో అనే చర్చ జరిగింది.
కానీ ఇందులో యుద్ధం రాముడికి, రావణుడికి కాదని.. రాముడికి, కుంభక∆్ణుడికి మధ్య అని తాజాగా ఈ చిత్ర రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అదనంగా ఈ ఎపిసోడ్ స్పెల్ బౌండ్ అయ్యేలా కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ ఒప్పంద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రామాయణంలో ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించే కుంభకర్ణుడి క్యారెక్టర్‌ను రాజమౌళి ఎలా ప్రజెంట్ చేసాడు.. అతడితో రాముడి యుద్ధాన్ని ఎంత రసవత్తరంగా తెరకెక్కిస్తాడు అని అందరూ క్యూ రియాసిటీ ప్రదర్శనలు చేస్తున్నారు.
వారణాసిలో కుంభకర్ణుడి పాత్రకు ఇవ్వనున్న ప్రాధాన్యాన్ని బట్టి.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్న విలన్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ పాత్ర పేరును కుంభంగా పరి చయం చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఫస్ట్ లుక్‌లో పృథ్వీరాజ్ చక్రాల కుర్చీకి పరిమితమై కనిపించాడు. రామాయణం కథ తెలిసిన వాళ్లకు కుంభకర్ణుడికి ఏమైందో ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ క్యారెక్టర్ అలా కనిపించడంలో అంతర్యం అర్థమవుతుంది.
రాముడు.. కుంభ కర్ణుడిని చంపకుండా తన కాళ్లూ చేతులు తెంచేస్తాడు. త్రేతాయుగం నాటి కుంభకర్ణుడి పాత్రకు వర్తమానంలో కుంభ పాత్ర ప్రతీకగా నిలుస్తుందన్నమాట. రాముడి పాత్రకు మహేష్ చేసిన రుద్ర పాత్ర ప్రతిబింబంగా భావించవచ్చు.
కాబట్టి రామాయణం ఎపిసోడ్లో మహేష్ రాముడిగా కనిపిస్తే.. కుంభకర్ణుడిగా కనిపించేది పృథ్వీరాజే అని ఫిక్స్యిపోవచ్చు. మొత్తానికి రామాయణ గాథకు, వర్తమానానికి రాజమౌళి భలే లింక్ కలిపినట్లే కనిపిస్తున్నాడు. ఎంతో ఆసక్తి రేకెత్తించేలా ఉన్న ఈ కథను రాజమౌళి తనదైన శైలిలో ప్రెజెంట్ చేస్తే వారణాసి మూవీ బాక్సాఫీస్ పెర్ఫామెన్సుకి ఆకాశమే హద్దన్నమాట.

