పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా కలెక్షన్స్ ని చూస్తుంటే , భవిష్యత్తులో కచ్చితంగా ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్‌గా మారుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి , క్రిటిక్స్ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ సన్నివేశాలపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఒక అమ్మాయిని ఇంత నీచంగా చూపిస్తారా ?, పెద్ది టీం కి స్త్రీల మీద ఉన్న గౌరవం ఇదేనా అంటూ సోషల్ మీడియా లో డైరెక్టర్ బుచ్చి బాబు పై విరుచుకుపడ్డారు. అయితే సోషల్ మీడియా నుండి వస్తున్న ఈ విమర్శలపై బుచ్చి బాబు ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఒక ఫిలిం మేకర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలి, వాళ్ళని సినిమాతో ఉత్తేజపరచాలి అని బలంగా నమ్మేవారిలో ఒకరిని నేను. కానీ వినోద పంచే క్రమం లో ఎవరినీ కూడా దేనికి గురి చేయకూడదు. పెద్ది చిత్రం లోని కొన్ని సన్నివేశాలకు ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని మేము తీసుకున్నాము. ఈ సందర్భంగా మీకు నేను చెప్పాలని అనుకున్నది , మహిళలపట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంటుంది , ఏ స్త్రీ పాత్రను కూడా ఒక వస్తువుగా చూపించడం కానీ , వాళ్ళని అగౌరవపరచడం కానీ నా ఉద్దేశ్యం కాదు.కానీ కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేశాయని చూపిస్తుంది, నా వల్ల బాధపడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’.
‘సోషల్ మీడియా లో వచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న మేము , ఆ సన్నివేశాలను ట్రిమ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. పెద్ది మూవీ ఫస్ట్ హాఫ్ లో హీరో రామ్ చరణ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం , ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి వివరణ ఇవ్వడం చూసి ఆడియన్స్ ఛీ కొట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తిట్టే తిట్లకు చెవులు మూసుకోవాల్సిందే. ఒక మంచి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం దృఢదృష్టకరం , ఆల సన్నివేశాల వల్ల గొప్ప సందేశాత్మక చిత్రం పొల్యూట్ అయ్యిందని , ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంకా మంచి స్పందన వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
చిత్రనిర్మాతగా, సినిమా ప్రేక్షకులను అలరించాలని, స్ఫూర్తినిస్తుందని మరియు కనెక్ట్ అవ్వాలని నేను నమ్ముతాను. ఇది ఎవరికీ అసౌకర్యంగా లేదా అగౌరవంగా భావించకూడదు. పెద్దిలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని విని సీరియస్‌గా తీసుకున్నాం.
నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది…
— BuchiBabuSana (@BuchiBabuSana) జూన్ 6, 2026

