సునీల్ గవాస్కర్ భార్య ఫోన్ కాల్ వీడియో: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాడిగా, సారధిగా, వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఇలా అనేక రకాల పాత్రలు పోషించాడు. 70 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఇప్పటికి ఆయన క్రికెట్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జట్టు బాగా ఆడితే అభినందిస్తారు. సరిగ్గా ఆడకపోతే ముఖం మీద తిడతారు. ఎలాంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి.. ప్రత్యర్థి జట్లను ఎలా ఓడించాలి.. అనే అంశాల మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటారు. యంగ్ ప్లేయర్లకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉంటారు.
సునీల్ గవాస్కర్ మొహమాటం లేకుండా మాట్లాడుతారు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. అతని దగ్గరికి వెళ్లి కరచాలనం తీసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్లో సూర్య వంశీ అదరగొడుతుంటే.. లగే రహో బేటా అంటూ దీవెనలు అందించారు. ఇలా తను గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప భావాలున్న మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
గవాస్కర్ సీరియస్ గా కామెంట్రీ చెప్తారు. అదే సమయంలో జోకులు కూడా వేస్తారు. ఆయనకు హాస్య స్ఫూరకమైన వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుందని అనేకమంది దిగ్గజ ప్లేయర్లు చెప్పారు. దానిని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు సునీల్ గవాస్కర్. అయితే అతడిలో భయాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు చూడలేదు. తొలిసారి దానిని చూసే అవకాశం ఇటీవల లభించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సునీల్ గవాస్కర్ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు. ఇటీవల అతడు ముంబైలో రోటరీ క్లబ్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతుండగా.. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చూడకుండానే అతడు తన భార్య అయి ఉంటుందని భావించి.. లిఫ్ట్ చేసాడు. షార్ట్ స్పీచ్ అని పెట్టాడు.. ఎక్కువగా మాట్లాడకూడదని నా భార్య ఇలా కాల్ చేసిందని గవాస్కర్ అనడంతో.. అక్కడున్న మొత్తం గట్టిగా నవ్వేశారు.” నా భార్య నన్ను అనేక సందర్భాలలో హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎక్కువ మాట్లాడకూడదు అని చెబుతూనే ఉంటుంది. అందుకే నేను షార్ట్ స్పీచ్ అని చెప్పాను” అని గవాస్కర్ చెప్పాడు.
సునీల్ గవాస్కర్ భార్య కాల్కు సమాధానం ఇవ్వడానికి ఈవెంట్ మధ్యలో ప్రసంగాన్ని పాజ్ చేశాడు https://t.co/G8jO6z2boE
వీడియో మూలం: ANI pic.twitter.com/CbfBtRne04
— NDTV (@ndtv) జూన్ 5, 2026

