ప్రభుత్వ విద్యా సంస్థల్లో సంస్కరణలు ప్రారంభించిన తెలంగాణ సర్కార్ విద్యార్థుల డ్రాపవుట్స్ అరికట్టేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల మధ్యలోనే చదువులు మానేయడానికి సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇందుకు కారణాలను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా పూటగడవని కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు మానేసి పనులకు వెళ్తుండడంతో డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను ప్రవేశపెట్టిన సర్కార్ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థుల కోసం కూడా ఇదే తరహా చర్యలను నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల జూనియర్ కళాశాలలకు వచ్చేసరికి మధ్యలో చదువు ఆపేస్తుండడంతో పేదలు ఉన్నత విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు పోషకాహార బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేయడంతో పేద విద్యార్థుల ఆటంకాలు లేకుండా ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను ప్రవేశపెట్టడం రాష్ట్ర విద్యా రంగంలో కీలకమైన సంస్కరణ. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ఏయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని సంవత్సరానికి సుమారు రూ. 180 కోట్ల వ్యయం అవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పరిమితమైన పోషకాహార పథకాలు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయికి కూడా విస్తరించడం ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇస్తున్న ప్రాధాన్యత నిదర్శనం.
ఈ కార్యక్రమం వెనుక కేవలం ఆకలి తీర్చడం మాత్రమే లక్ష్యం కాదు. ఇంటర్మీడియట్ దశలో పెరుగుతున్న డ్రాప్ అవుట్లను తగ్గించడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, పోషకాహార లోపాలను నివారించడం, ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థుల విశ్వాసాన్ని పెంపొందించడం, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం వంటి బహుముఖ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు సరైన ఆహారం తీసుకోకుండానే పూట కళాశాలలకు హాజరుకావడానికి ఉదయం అనేక అధ్యయనాలు వెల్లడయ్యాయి. అలాంటి విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించడంతో చదువులో రాణించలేకపోతున్నారు. పడికడుపుతో ఆరోగ్య పరిస్థితులు కూడా వారికి ప్రతికూలంగా మారుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఖాళీ కడుపుతో విద్యార్థి చదువు కొనసాగించడం సాధ్యం కాదనే భావనతో ప్రభుత్వం ఈ బృహత్ రూపొందించబడింది.
పరీక్షల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఈ పాఠశాల స్థాయిలో డ్రాప్అవుట్లు కొంత మేర నియంత్రణలో ఉన్నాయి. అయితే పదో తరగతి తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థుల ప్రయాణ ఖర్చులు పుస్తకాలు, ఇతర విద్యా అవసరాల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలను చదువు మాన్పించి వైపు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతాల్లో, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో, బాలికల విషయంలో ఈ గ్రామీణ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల హైస్కూల్ స్థాయితో ప్రస్తుత ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువులను మధ్యలోనే ఆపేస్తున్న ప్రమాదం ఎక్కువగా ఉందని పలు విశ్లేషణల్లో తేలింది. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల రాజీనామా చేసిన అకునూరి మురళి పలు సందర్భాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యను కేవలం తరగతి గదులకు పరిమితం చేయకుండా, విద్యార్థుల సంపూర్ణ అభివృద్దికి అవసరమైన పోషకాహారం, కౌన్సెలింగ్, మౌలిక సదుపాయాలు, సురక్షిత విద్యా వాతావరణం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్‌ను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక, సామాజిక మద్దతు అవసరమని తెలిపారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహారం, భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గురుకుల, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత వసతి, పోషకాహారం, పర్యవేక్షణ, క్రమబద్ధమైన అధ్యయన వాతావరణం అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగా గురుకుల విద్యాసంస్థల్లో డ్రాప్అవుట్లు సాధారణంగా తక్కువగా ఉండటమే కాకుండా, ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తున్నారు. గురుకులాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వారికి అందుతున్న నాణ్యమైన ఆహారం, నివాస సౌకర్యాలు, నిరంతర పర్యవేక్షణ. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఆహార భద్రత కల్పించడం ద్వారా పేద విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది, ప్రభుత్వం దీన్ని ఖర్చు కాకుండా మానవ వనరులపై పెట్టుబడిగా గణిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం సంవత్సరానికి సుమారు రూ. 180 కోట్ల వరకు ఖర్చు. ప్రభుత్వ, ఐడెడ్ జూనియర్ కళాశాలల్లో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా రానున్నారు. అంటే ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి సగటున రూ. 9 వేల వరకు, నెలకు సుమారు రూ. 750 వరకు ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ పరంగా చూస్తే ఇది అదనపు భారం అయినప్పటికీ, విద్యార్థుల డ్రాప్అట్లను తగ్గించడం, పోషకాహార లోపాలను నివారించడం, కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం, భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఈ ఖర్చు సమర్థనీయమైనది. విద్యార్థి మధ్యలో చదువు మానేయడంవల్ల ఆ కుటుంబం, సమాజం, ప్రభుత్వంపై పడే సామాజిక, ఆర్థిక భారం కంటే ఇప్పుడు పడుతున్న ఆర్థిక భారం ఎక్కువేమీ కాదు.
ఈ పథకంలో భాగంగా నేషనల్ ఇన్పుట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు వారికి పోషకాహారం అందించిన ప్రభుత్వం ప్రత్యేక మెనూను రూపొందించింది. విద్యార్థులకు అవసరమైన శక్తి, ప్రోటీన్లు లభించేలా మెనూ ఉంది. వారికి దోసె, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా, బోండా, పూరీ, చట్నీ, సాంబార్, కూరలు, పాలు, రాగి మాల్ట్ వంటి ఆహార పదార్థాలను అందజేస్తారు. పోషకాహార లోపాలను తగ్గించడమే కాకుండా విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇంటర్మీడియట్ బ్రేక్‌ఫాస్ట్ పథకం కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది విద్యార్థుల ఆరోగ్యం, డ్రాపవుట్స్ నివారణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, సామాజిక సమానత్వం వంటి అనేక లక్ష్యాలను కలగలిపిన సమగ్ర విద్యా సంస్కరణ. పదో తరగతి తర్వాత చదువు మానివేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్న అనేక మంది పేద విద్యార్థులకు ఈ కార్యక్రమం ఒక భరోసాగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెరగడం, హాజరు శాతం మెరుగుపడడం, డ్రాపవుట్స్ తగ్గడం, విద్యార్థుల ఫలితాలు మెరుగుపడడం వంటి సానుకూల ఫలితాలు కనిపిస్తే తెలంగాణ విద్యారంగంలో ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

