సూర్య వశిష్ట రమణి కళ్యాణం OTT విడుదల తేదీ లాక్ చేయబడింది: రీసెంట్ రొమాంటిక్ డ్రామా 3 వారాల్లోపే ఓటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. సూర్య వశిష్ట, దీప్శిఖా చంద్రన్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ‘రమణి కల్యాణం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ మేకర్స్.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రమణి కల్యాణం మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో 20 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ‘సన్ నెక్స్ట్’ (sunNXT)లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సూర్య, దీప్శిఖాలతో పాటు శ్రీనివాసరెడ్డి, యాంకర్ శ్యామల, చైతూ జొన్నలగడ్డ కీలకపాత్ర పోషించారు. థియేటర్లో నార్మల్ రెస్పాన్స్ అందుకున్న మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూడాల్సి ఉంది.
మీ ఆత్మకు స్వస్థత చేకూర్చేవాడే పర్ఫెక్ట్ మ్యాచ్ అయినప్పుడు.
జూన్ 12 నుండి సన్ NXTలో రమణి కల్యాణం ప్రసారం చేయండి!#రమణీకళ్యాణం #తెలుగు సినిమాలు #TFI #SunNXT
(ఫీల్ గుడ్ మూవీస్, తెలుగు మూవీస్, కొత్త తెలుగు మూవీస్, దీప్షిక, సూర్య వశిష్ట, రొమాన్స్ మూవీస్, ఎమోషనల్ డ్రామా, పొయెటిక్ మూవీస్,… pic.twitter.com/LL5Wa17mDS
— SUN NXT (@sunnxt) జూన్ 7, 2026
ఇది కూడా చదవండి : కెవిన్ కుంట డాన్స్ : చికిరి చికిరి పాటకు కెవిన్ కుంట స్టెప్పులు – రామ్ చరణ్ బాడీగార్డ్ సిగ్నేచర్ షాట్
స్టోరీ ఏంటంటే?
చిన్నతనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుటుంబంతో పాటు కంటి చూపును కోల్పోతుంది సంజన (దీప్సిఖా చంద్రన్). అయితే, తనపై ఇతరులు సింపతీ చూపించడం తనకు నచ్చదు. చూపు లేకున్నా నిరుత్సాహపడకుండా తన బామ్మ, నలుగురు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. పబ్‌లో సింగర్‌గా, ఆర్జేగానూ వర్క్ చేస్తుంది. అలాంటి ఆమెకు ఎప్పుడూ గతాన్ని తలుచుకుని బాధ పడే రాజ్ (సూర్య వశిష్ట) అనుకోకుండా పరిచయం అవుతాడు.
ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన రాజ్ వీల్ చైర్‌కే పరిచయం అయిన కుర్రాడు రాజ్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. సంజన ఇన్స్పిరేషన్తో రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. మరి రాజ్ అనుకున్నది జరిగిందా? వీరిద్దరూ ప్రేమలో పడితే పబ్ ఓనర్, రాజ్ ఫ్రెండ్ కిశోర్ (శ్రీనివాసరెడ్డి) టెన్షన్ పడతాడు. వీళ్లద్దరికి ప్రేమలో ఎదురైన కష్టాలేంటి? విలన్ ఎవరు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

