– ప్రకటన –
రోజూ స్కూల్లో యోగా, మెడిటేషన్, క్రీడాపోటీలు
2027 జనవరి 10 నాటికి టెన్త్ సిలబస్ పూర్తిచేయాలి
మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్
51 రోజులపాటు వేసవి సెలవులు
2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
ప్రస్తుత విద్యాసంవత్సరం (2026-27)లో పాఠశాలల పనిదినాలు 227 ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతి రోజూ ఉదయం ప్రార్థన సమయంలో లేదా ఫస్ట్ పీరియడ్లో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయాలని సూచించింది. ఇకపై నిత్యం విద్యార్థులకు ఆటల్లో శిక్ష, పోటీలు నిర్వహించడం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది జూన్ 15న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం 2027 ఏప్రిల్ 24న ముగుస్తుంది. 51 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి 2027 జూన్ 14 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆదివారం విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా 2026-27 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు.
ప్రధానాంశాలు
10వ తరగతి విద్యార్థులకు జనవరి 10లోపు సిలబస్ ను పూర్తి చేయాలి. 1 నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28 వరకు సిలబస్ పూర్తి చేయాలి. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు 13 రోజులు ఉంటాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు ఉంటాయి. వేసవి సెలవులు 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు ఉంటాయి.
పరీక్షలు ఇలా..
ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ)-1న జూలై 31 లోపు, ఎఫ్ఏ-2న సెప్టెంబర్ 21 లోపు, సమ్మేటివ్-1 పరీక్షలను అక్టోబర్ 1 నుంచి 9 వరకు, ఎఫ్ఏ-3ను డిసెంబర్ 10 లోపు, ఎఫ్ఏ-4ను 10వ తరగతి వారికి జనవరి 27 లోపు, 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించాలి.
10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 28న నిర్వహించాలి. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలను 2027 మార్చిలో నిర్వహించారు.
ఎస్ఏ-2 పరీక్షలను 1 నుంచి 9వ తరగతుల వారికి ఏప్రిల్ 9 నుంచి 19 వరకు నిర్వహించాలి.
నెలవారీ పనిదినాలు
జూన్లో 14 రోజులు, జూలైలో 26, జులైలో 22, సెప్టెంబర్లో 23, అక్టోబర్లో 15, నవంబర్లో 23, డిసెంబర్లో 24, జనవరిలో 20, ఫిబ్రవరిలో 23, మార్చిలో 21, ఏప్రిల్లో 16 రోజులు మొత్తం కలిపి 227 పనిదినాలతో ఆగస్టు 2026-27 విద్యా సంవత్సరపు విద్యా సంవత్సరం.
నో బ్యాగ్ డే
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రతి మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’గా ఆమె ఎంపిక చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి రోజూ 30 నిమిషాలు పఠనానికి కేటాయించాలి. అందులో పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ను విద్యార్థులతో చదవాలి. దీన్ని ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ స్వయంగా పర్యవేక్షించాలి.
– ప్రకటన –

