నేడు ఇండి కూటమి సమావేశం జరగనుంది. సుదీర్ఘకాలం తర్వాత ఇండి కూటమి సమావేశం జరుగుతుంది. ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగనుంది. మొత్తం ఇరవై మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఈ ఇంటి కూటమి నేతల సమావేశానికి హాజరు కానున్నారు. కేందప్రభుత్వ పై పోరాడేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించనున్నారు.
23 రాజకీయ పార్టీలు…
ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశానికి కొన్ని మిత్రపక్షాలు దూరమయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే ఈ కూటమి సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పాటు ధరల పెరుగుదల, దేశంలో నెలకొన్న పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండనుంది.

