ఆర్ ప్రజ్ఞానానందతో సీఎం విజయ్ భేటీ అయ్యారు: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక ఎత్తు వేస్తే.. అతడు అంతకు మించిన ఎత్తులు వేశాడు. మొదట్లో సిపాయితో ఎత్తులు వేశాడు. మద్దెలో గుర్రాన్ని ఉపయోగించాడు. కానీ అవి కూడా అతడిని కాపాడలేకపోయాయి. పైగా రాజు పీఠానికే ఎత్తుపెట్టడంతో.. విజయ్ చేతులెత్తేశాడు. ఇదంతా కూడా సినిమానో.. ఇంకోటో కాదు. ఇది తమిళనాడు సీఎం జరిగింది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ గెలిచాడు. ఈ ఘనత సాధించిన భారతీయుడిగా అతడు నిలిచాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం అతడు నార్వే నుంచి నేరుగా తమిళనాడు వచ్చాడు. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ ని ఆయన క్యాంపు ప్రారంభించారు సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా విజయ్ అతడికి పుష్ప గుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికాడు. తమిళనాడు ఘనతను.. భారతదేశ ప్రతిష్టను నిలిపారంటూ ప్రజ్ఞానందను అభినందించాడు విజయ్. అక్కడితోనే ఆగిపోలేదు.. అతడితో చెస్ ఆడాడు. విజయ్ కి చెస్ ఆడటం వచ్చు. విజయ్ ఒక ఎత్తు వేస్తే.. ప్రజ్ఞానంద అంతకుమించిన ఎత్తులు వేశాడు. అదే కాదు విజయ్ సిపాయిలను.. గుర్రాన్ని కూడా చంపేశాడు. విజయ్ కూడా తనదైన శైలిలో ప్రజ్ఞానంద సిపాయిలను మట్టుపెట్టాడు.
ప్రజ్ఞనంద సాధించిన ఘనతకు ముగ్ధుడైన విజయ్.. తమిళనాడు ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలను నజరానాగా అందించాడు. దానికి సంబంధించిన చెక్కు ప్రజ్ఞానందకు క్యాంపు కూడా అందించాడు. ఈ సందర్భంగా విజయ్ కి ప్రజ్ఞానంద ధన్యవాదాలు తెలియజేశాడు. అతడి తల్లిదండ్రులు కూడా విజయ్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రజ్ఞానంద తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువ చదరంగ క్రీడాకారుడు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నీలలో అతడు సత్తా చూపించాడు. చదరంగం క్రీడలో అత్యంత ప్రమాదకరమైన నార్వే ట్రోఫీని గెలిచి సత్తా చూపించాడు ప్రజ్ఞానంద. తమిళనాడు రాష్ట్రానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రజ్ఞానంద మొదట్లో ఈ స్థాయిలో ఉత్సాహంగా ఉండేవాడు కాదు. చదరంగం మీద ఆసక్తిని అతనికి కలిగేలా చేయడంలో తల్లి ముఖ్యపాత్ర పోషించింది. అతడు వెళ్లే ప్రతి టోర్నీలో వెంట ఉండేది. అతడు ఓడిపోయినప్పుడు గెలిచే విధంగా ప్రోత్సాహం అందించబడుతుంది. గెలిచినప్పుడు మరింత గొప్పగా ఆడాలని స్ఫూర్తి నింపేది. అందువల్లే ప్రజ్ఞానంద ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప క్రీడాకారులు కూడా సాధించలేనిది.. తన ఖాతాలో వేసుకొని.. సరికొత్త చరిత్ర సృష్టించాడు ప్రజ్ఞానంద. ప్రజ్ఞానంద నార్వే టోర్నీలో గెలిచిన సందర్భాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రస్తావించారు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేశాడని తన ట్విట్టర్ ఖాతాలు నరేంద్ర మోడీ ప్రస్తావించారు.
#చూడండి | చెన్నై | చెస్ క్రీడాకారుడు నార్వే చెస్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత తమిళనాడు సిఎం విజయ్ ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానందను కలుసుకున్నాడు మరియు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ తరపున అతనికి రూ. 50 లక్షలు ప్రదానం చేశాడు.
(మూలం: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX
– ANI (@ANI) జూన్ 8, 2026

