విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని SMS-2 మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలిస్తున్న సమయంలో మోల్టెన్ రికార్డు లాడెల్‌కు సంబంధించిన బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ మొత్తంలో లిక్విడ్ ఉక్కు ప్రమాదవశాత్తూ.. అక్కడ డ్యూటీలో ఉన్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మందికి పైగా మృతి చెందారు. వేడి వేడి ఉక్కు మీద పడడంతో మృతదేహాలు కాలి బూడిదైపోయినట్లు తెలిసింది.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని SMS-2 మరియు STC-3 హీట్ ఫెసిలిటీలో పెద్ద మొత్తంలో కరిగిన ఉక్కు లీక్ కావడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మరియు అనేకమంది గాయపడ్డారు. గరిటె పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది…
– ANI (@ANI) జూన్ 8, 2026
మరికొందరు గాయపడగా.. వెంటనే ప్లాంట్ ఆసుపత్రికి అధికారులు, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు చికిత్స అందించారు. ప్రమాదం అనంతరం ఘటన స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అత్యవసరంగా అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, నిర్వహణలో నిర్లక్ష్యమా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.
►ఇంకా చదవండి | వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. మరుగుతున్న లిక్విడ్ స్టీల్ కార్మికుల మీద పడింది..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో హృదయ విదాకర దృశ్యాలు కనిపించాయి. లిక్విడ్ స్టీల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మరుగుతున్న స్టీల్ పడటంతో 9 మంది కార్మికులు సజీవ దహనం అయినట్లు తెలిసింది. నలుగురు మృతదేహాలను గుర్తించారు. లిక్విడ్ స్టీల్‌తో బీమ్స్ తయారు చేసే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో.. లాడల్ బ్లాస్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం అని కార్మిక సంఘాలు చెప్పాయి. ప్రమాద సమయంలో 150 టన్నుల లిక్విడ్ స్టీల్ ఉందని కార్మికులు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదంలో కార్మికులు చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని. హోం మంత్రి ప్రమాద స్థలానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.

