Published on: 6:48 pm, 8 జూన్ 2026
ఏపీలో సోమవరం ఓ ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం కారణంగా స్టీల్ ప్లాంట్లో అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ మంటలను చూసిన కార్మికులు, స్లీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదం ఏపీలో ఒక్కసారిగా భయాందోళనలను రేపింది. పెద్దగా ప్రమాదాలు లేకుండా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒక్కసారిగా 8 మంది పొట్టనబెట్టుకున్న యాక్సిడెంట్ జరిగిన తీరును చూసి జనం భయానికి గురయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతోంది.
ఈ కారణాల విషయానికి వస్తే… విశాఖ స్లీల్ ప్లాంట్లో ముడి ఖనిజం నుంచి ఉక్కును తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ద్రవ ఉక్కును పైకి ఎత్తుతున్న సమయంలో… ఓ భారీ బకెట్ నుంచి ఉక్కు ద్రవం లీకై కింద పడిపోయింది. అసలే వందల డిగ్రీ ఉష్టోగ్రతలతో ఉన్న ద్రవ ఉక్కు దేనిపై పడినా అది భస్మం కాక తప్పదు. ఈ ప్రమాదంలోనూ అదే జరిగింది. ఉక్కు ద్రవాన్ని పైకి ఎత్తిపోస్తున్న సమయంలో ఆ బెకెట్ లోని ద్రవం లీకైంది. ఆ ద్రవ ఉక్కు పడిన కారణంగా అక్కడ ఉన్న బారీ క్రేన్ అక్కడికక్కడే బుగ్గి అయ్యిందట.
ఈ ప్రమాదంలో ఉక్కు ద్రవం పడిన ప్రాంతమంతా అదిక వేడితో నిండిపోయింది. ఈ సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్మికులు మృత్యువాత పడినట్లు సమాచారం. అసలు ఉక్కు ద్రవాన్ని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఉక్కు ద్రవం మనిషి మీద పడితే మడిపోక తప్పదు. భారీ క్రేన్ నే దహించి వేసిన ఉక్కు ద్రవం 8 మంది కార్మికులను కూడా పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన ఉక్కు ద్రవం లీక్ కావడానికి గల కారణాలేమిటన్న విషయం తేలాల్సి ఉంది.

