తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లోకి పెద్దపులి మరోసారి ప్రవేశించింది. మన్యంలో అడవి పంది పిల్లతో పులి ఉన్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీతానగరం మండలం రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం , నెలకోట ఆవ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్లు జిల్లాశాఖ అధికారులు పేర్కొన్నారు.
సమీపంలో ఉన్న గ్రామాలు…
సమీపంలో ఉన్న పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపురుపల్లి, చినకొండపూడి, పెదకొండేపూడి గ్రామాల ప్రజలు, సీతా మండలముకు చెందిన గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండాలని, పెంపుడు జంతువులను బయట వదిలేయకూడదన్నారు.

