. ఇరాన్`ఇజ్రాయిల్ మధ్య భీకర దాడులు
. శాంతి ప్రయత్నాలకు విఘాతం
. ట్రంప్ సూచన పట్టించుకోని నెతన్యాహు
తెహ్రాన్/టెలఅవివ్: యుద్ధం ముగిసిందనుకున్న వేళ మళ్లీ మంటలు ఎగిసిపడ్డాయి. నిశ్శబ్దం వచ్చిందనుకున్న వేళ మళ్లీ సైరన్లు మోగాయి. సరిహద్దులు సద్దుమణిగాయనుకున్న వేళ మళ్లీ క్షిపణులు గాల్లోకి ఎగిరాయి. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణతో కొంత శాంతి నెలకొన్నట్టు కనిపించినా… తాజాగా ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఇజ్రాయిల్, ఇరాన్ మాత్రమే కాక లెబనాన్, యెమెన్, ఇరాక్ వరకు ఈ ఉద్రిక్తతలు విస్తరించడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ఇరాన్… ఇజ్రాయిల్‌పై క్షిపణులు ప్రయోగించారు. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయిల్‌పై తెహ్రాన్ నేరుగా క్షిపణులు ప్రయోగించడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యకు దిగినట్లు తెహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్ దాడుýతో దేశంలోని అనేక ప్రాంతాల హెచ్చరిక సైరన్లు మోగినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం (ఐడీఎఫ్) . ఇరాన్ మొత్తం 11 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించారు. వాట నిర్వహిస్తున్న గగనతలంలోనే విజయవంతంగా చెప్పుకుంటామని. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని. ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించింది. మరోవైపు ఇరాన్ దాడులకు ప్రతిస్పందించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి వారించినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ గుర్తుచేశారు. “ఇప్పటికే మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చర్చలకు రండి” అని ఇరాన్‌కు సూచించారు. మరోవైపు నెతన్యాహుని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ “వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు. అయితే ట్రంప్ ఎంత వారిస్తున్నా.. ఇజ్రాయిల్ ఆయన మాటను లెక్కచేయలేదు. సోమవారం ఉదయం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దళాలు దాడులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వైమానిక దళం భారీ దాడులు చేపట్టింది. తెహ్రాన్‌లో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీనితోపాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లాయి. ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించడంతో ఇరాన్ గగనతలం మూసివేసింది. మరోవైపు ఖతార్, సిరియాలు ఇప్పటికే ఇరాన్ దాడుల కారణంగా గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయిల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లు ఇరాన్ ఆరోపించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమేనీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అన్ని విమానాల రాకను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.
పోస్ట్ పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదట కనిపించింది విశాలాంధ్ర.

