వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను…
దీంతో మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారిని కూడా జగన్ పరామర్శించనున్నారు. ప్రమాదం తీరును వారిని అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో జగన్ మాట్లాడనున్నారు. జగన్ విశాఖకు వచ్చిన తాజా నేతలు ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

