అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సినిమా క్యాన్సిల్ అని టాక్ రాగా అవేమి నిజం కాదని క్లారిటీ వచ్చింది. ఇక దసరా పండుగ తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేందుకు టీమ్ రెడీ అవుతోందనే టాక్ వస్తోంది. రాకాతో పాటు ఈ సినిమా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఫుల్ అనే దానికంటే, బన్నీకి ఎదురుగా నిలబడే పవర్ విలన్ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తారనే పాయింట్ పైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో ప్రతినాయకుడి పాత్ర అత్యంత కీలకం కాబోతోందని ఇన్ సైడ్ టాక్. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో విలన్ పాత్రలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. హీరో పాత్రను ఎంత బలంగా చూపిస్తాడో, నెగిటివ్ రోల్స్ ను కూడా అంతే పవర్ ఫుల్ గా డిజైన్ చేయడం అతని మేకింగ్ స్టైల్.
గతంలో మాస్టర్, విక్రమ్, లియో లాంటి చిత్రాలలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సంజయ్ దత్ లాంటి స్టార్లను విలన్లుగా పెట్టి మెప్పించాడు. సర్ ప్రైజ్ గా రోలెక్స్ సూర్య వచ్చాడు. కేవలం హీరో ఎలివేషన్స్ కాకుండా కథను ముందుకు నడిపించే ఒక బలమైన ఇంజిన్ లా ఆ పాత్రలు ఉంటాయి. అందుకే ఈ కొత్త సినిమాలో కూడా విలన్ ఎవరనే దానిపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.
కానీ ఇదే సమయంలో లోకేష్ తన గత చిత్రాలను కూడా ఇక్కడ కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. రజినీకాంత్ తో భారీ అంచనాల మధ్య తీసిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున లాంటి బడా స్టార్లను కాస్టింగ్ లో పెట్టారు. ఆ మల్టీస్టారర్ హడావుడి చూసి జనాలు కూడా ముందుగా భారీగానే థియేటర్లకు వెళ్లారు. కానీ స్క్రిప్ట్‌లో అసలు దమ్ము లేకపోవడంతో అంత పెద్ద తారాగణం ఉన్నా కూడా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో అస్సలు ఆడలేదు. ఆ సినిమా భారీ నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా నిలిచింది.
కేవలం పెద్ద స్టార్లను విలన్లుగా పెట్టేస్తే సినిమా హిట్ అయిపోదు అనే సత్యాన్ని కూలీ బాక్సాఫీస్ రిజల్ట్ చాలా స్పష్టంగా నిరూపించింది. కథలో ఇంటెన్సిటీ లేనప్పుడు ఎంతమంది క్రేజీ యాక్టర్లను తీసుకొచ్చినా కమర్షియల్ గా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాత్రకు తగిన వెయిట్ ఉన్నప్పుడే ఆడియన్స్ ఎమోషనల్ గాల థియేటర్లలో కనెక్ట్ అవుతారు. అందుకే ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం లోకేష్ కేవలం స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ల వెనుక పడకుండా, కథకు పక్కగా సెట్ అయ్యే నటుడిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అతని ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

