రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (RC17)
RC17
RC17 : రామ్ చరణ్ ఇటీవలే పెద్ది సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. థియేటర్స్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే 315 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. పెద్ద చరణ్ తర్వాత సుకుమార్ తో సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేసాడు. RC17 అని వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
పుష్ప 3 అవ్వగానే సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడని వార్తలు వచ్చాయి. పెద్ది అవ్వగానే చరణ్ తో సుకుమార్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం అయ్యేలా కనిపించట్లేదు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాత చరణ్ ఇప్పుడు మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: రమణి కళ్యాణం : 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే సినిమా.. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..
పెద్ది సినిమా కోసం చరణ్ ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడ్డాడు. అనేక గాయాలు అయ్యాయి. మణికట్టుకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు. దీనితో చరణ్ కి ప్రస్తుతం విశ్రాంతి, వైద్య సహాయం చాలా అవసరం. అందుకే చరణ్ అన్ని రకాలుగా చేయించుకొని, గాయాలు తగ్గించుకొని, మణికట్టు ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ పర్ఫెక్ట్ గా ఫిట్ గా తయారై రావడానికి ప్లాన్ చేసాడు. దీనికోసం మూడు నెలల పాటు బ్రేక్ తీసుకోబోతున్నాడు అని మెగా సన్నిహితుల సమాచారం.
ఇలా మూడు తర్వాతే సుకుమార్ సినిమా గురించి ఆలోచించాలి అని తెలుస్తుంది. అటు సుకుమార్ కూడా ఇంకా కథని చెక్కే పనిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా మొదలుపెడతారో అని ఫ్యాన్స్ ఉన్నారు.

