ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జూన్ 12వ తేదీన ప్రభుత్వ జాబ్ మేళాను విడుదల చేయడం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవీ. సురేష్ బాబు, ఏపీ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో నిరుద్యోగ యువతి, యువకుల కోసం అందించామని తెలిపారు. 10 కంపెనీల కొరకు ఈ ఉద్యోగం ఎలా పొందామని, పదవ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ పీజీ పూర్తి చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగులు అర్హులు అని తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారికి నెలకు 15000 నుండి 25 వేల రూపాయల వేతనం ఉన్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారు పెనుకొండ, అనంతపురం, బెంగళూర్, హిందూపురం, కళ్యాణదుర్గం, గోరంట్ల వంటి ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ఆధార్ కార్డు , విద్యా అర్హత పత్రాలు తీసుకొని జూన్ 12వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9182288465కు సంప్రదించాలని తెలిపారు.
పోస్ట్ 12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.. మొదట కనిపించింది విశాలాంధ్ర.

