పెద్ది బాక్స్ ఆఫీస్ కలెక్షన్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీ ని చూస్తుంటే , ఈ చిత్రం లాంగ్ రన్ రంగస్థలం ని మించి ఉంటుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి సోమవారం రోజున ఈ చిత్రం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి వర్కింగ్ డే ఈ రేంజ్ షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రావడం చూసి దాదాపుగా రెండేళ్లు అయ్యింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ చిత్రం నమోదు అవుతున్న వసూళ్లు వర్ణనాతీతం. ఈమధ్య కాలం లో ఉత్తరాంధ్ర ప్రాంతం సంక్రాంతి సీజన్ లో మాత్రమే సినిమాలకు అనుకూలంగా ఉంటుంది.
మిగిలిన సీజన్లలో ఈ ప్రాంతం నుండి వసూళ్లు పెద్దగా నమోదు అవ్వలేదు. కానీ ‘పెద్ది’ చిత్రం సంక్రాంతికి సీజన్ ని మించిన వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదు అవుతున్నాయి. 5 వ రోజు వర్కింగ్ డే వచ్చాయి ఈ చిత్రం 1 కోటి 35 లక్షల రూపాయల షేర్ వసూళ్లు. అదే విధంగా 6 వ రోజు కూడా ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే వరుసగా 6 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాబట్టిన అరుదైన సినిమాల్లో ఒకటిగా ‘పెద్ది’ చిత్రం నిలిచిపోతుంది. ప్రస్తుతానికి అయితే 5 రోజుల్లో ఈ చిత్రం ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది ‘దేవర’, ‘ఓజీ’ ఉత్తరాంధ్ర ప్రాంతం క్లోజింగ్‌తో సమానం.
ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా ప్రతిష్టాత్మకంగా 20 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని , ఫుల్ రన్ లో ఆల్ టైం రికార్డు నమోదు చేసినట్లు ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా ఉత్తరాంధ్రలో ఈ రేంజ్ సునామీని క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం , ఈ చిత్రం ఉత్తరాంధ్ర యాసలో ప్రదర్శించడమే అని అంటున్నారు విశ్లేషకులు. రాయలసీమ , తెలంగాణ యాసలో ఇది వరకు గతం లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి , కానీ ఉత్తరాంధ్ర యాసలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. ‘పెద్ది’ చిత్రం ఆ యాసలో ప్రదర్శించడం వల్ల, ఈ ప్రాంతం నుండి కాసుల కనకవర్షం కురిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ రికార్డు భవిష్యత్తులో వారణాసి కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు.

