విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సీబా రామలింగయ్య మనవడు, ఆయుర్వేద డాక్టర్ షీబా నగేష్ గుప్తా, డాక్టర్ సిబా కుమారుడు షీబా కేదార్నాథ్ గుప్తా పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 591 మార్కులు తేవడం జరిగింది. తదుపరి విద్యార్థికి సంతృప్తి లేకపోవడంతో రీవాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకోగా 592 మార్కులను కైవసం చేసుకుంది. దీనితో యశోద స్కూల్లో ప్రధమగా, అదేవిధంగా ధర్మవరం టౌన్ లో రెండవ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా యశోద స్కూలు యాజమాన్యంతో పాటు, తల్లిదండ్రులు, తాత, బంధుమిత్రులు, తోటి స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి కేదార్నాథ్ అభినందనలు తెలియజేశారు.

