తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకుంటున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే మూడు పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 10న వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అంటేకాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40 గంటల నుంచి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
40-50 అడుగుల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ఇక జూన్ 11,12 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా వాతావరణం ఉంటుంది.
అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు,ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం జూన్ 12 తర్వాత కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్ నగరంలో కూడా వర్షాల ప్రభావం కనిపించనుంది. నగరం, పరిసర ప్రాంతాలు రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది.ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో పలు ప్రాంతాల నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు
అదే సమయంలో తెలంగాణ వెదర్ మ్యాన్ నివేదిక ప్రకారం, నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లోనే నిలిచిపోయే అవకాశం ఉంది. కనీసం జూన్ 17 వరకు అవి ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు పెద్దగా ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు.
అలాగే జూన్ 18 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో జూన్ 19 నుంచి 23 మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల చురుకుదనం పెరిగి, వర్షాల తీవ్రత కూడా అధికమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

