– పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం ;ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా.మొహరం (పీర్ల పండుగ) వేడుకల సంబరాల్లో భాగంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పండుగ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించారు.పండుగ సంప్రదాయాల పేరుతో ఎదిగిన చెట్లను, కొమ్మలను నరికివేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం లభించకపోగా, తీవ్రమైన పాపం చుట్టుకుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ముఖ్య సూచనలలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి: పండుగ ఆచారాల కోసం పచ్చని చెట్లను నరకడానికి బదులు.. ఎండిపోయిన కొమ్మలను లేదా ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలకు నష్టం: ఒక చెట్టు పెరగడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటిది క్షణికావేశంలో లేదా అజ్ఞానంతో చెట్లను నరికితే రాబోయే తరాలకు ఆక్సిజన్ కొరత, తీవ్రమైన ఎండలు, పర్యావరణ పరివర్తన దెబ్బతినడం శాపాలు, ఆవశ్యక చర్యలు తప్పవు అని అన్నారు. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎవరైనా చెట్లను నరికితే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి గ్రామంలోని మొహరం ఉత్సవ కమిటీలు ముందస్తుగానే గ్రామస్థులకు ఈ విషయమై అవగాహన కల్పించాలి. పచ్చని ప్రకృతి మధ్య పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి.ప్రకృతిని పూజించడమే నిజమైన భక్తి. పచ్చని చెట్లను నరికి భగవంతుడికి ఆగ్రహం తెప్పించవద్దు అని అన్నారు. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు , చైతన్యవంతమైన పౌరులందరూ గ్రామాల్లో తిరిగి ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేయాలి.
పోస్ట్ మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి మొదట కనిపించింది విశాలాంధ్ర.

